అయ్యో చిన్నారి : బాల్కనీ గ్రిల్స్‌లో చిక్కుకుని

  • Published By: veegamteam ,Published On : January 29, 2019 / 11:15 AM IST
అయ్యో చిన్నారి : బాల్కనీ గ్రిల్స్‌లో చిక్కుకుని

Updated On : January 29, 2019 / 11:15 AM IST

యున్లాంగ్ కౌంటీ : చిన్న పిల్లలకు ఏదన్నా ఆపద సంభవిస్తే అందరు బాధపడతారు..ఆ చిన్నారులు ఎవరి పిల్లలైనా సరే.. ఇదిగో ఇక్కడ కనిపించే ఓ చిన్నారి పరిస్థితి చూసి అందరు తెగ బాధపడ్డారు..భయపడ్డారు. మూడవ అంతస్థు బాల్కనీలో ఆడుకుంటు..ఆడుకుంటున్న ఓ చిన్నారి గ్రిల్ లో చిక్కుకుపోయింది. దీంతో ఆ చిన్నారి తల భాగం గ్రిల్స్ మధ్య ఇరుక్కుపోగా, శరీరం గాలిలో వేలాడుతోంది. చైనాలోని యున్లాంగ్ కౌంటీలో  జనవరి 25 లో చోటుచేసుకుంది.

 

ఆ చిన్నారికి ఏమైపోతుందో అనే ఆందోళన చూసేవారందరిలోను నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని గమనించిన ఇద్దరు వ్యక్తులు అతికష్టం మీద అక్కడకు చేరుకుని ఆ చిన్నారిని గ్రిల్స్ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో ఇప్పటివరకూ 52 వేల మందికి పైగా వీక్షించారు. కాగా చూసివారంతా చిన్నారి పట్ల తీవ్ర ఆందోళన చెందారు.