టైర్-4 ఎమర్జెన్సీ లాక్‌డౌన్: వార్ జోన్లుగా లండన్ స్టేషన్లు.. ‘క్రిస్మస్’ వద్దన్నారని.. వదిలిపోతున్న నగరవాసులు

London stations War Zones Tier-4 Lockdown : లండన్‌ స్టేషన్‌లు అన్నీ వార్ జోన్లుగా మారిపోయాయి. నగరవాసులంతా లండన్ వదిలిపోతున్నారు. టైర్-4 ఎమర్జెన్సీ లాక్ డౌన్ ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. కరోనావైరస్ కొత్త రకం వైరస్ విజృంభిస్తోంది. వైరస్ కట్టడిలో భాగంగా ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ క్రిస్మస్ వేడుకలపై కఠిన ఆంక్షలు విధించారు. ఎవరూ నగరానికి దాటి బయటకు రావొద్దని, ఇళ్లకే పరిమితం కావాలని నగరవాసులను ఆదేశించారు.

కానీ, లండన్ ప్రభుత్వం ఆదేశాలను ధిక్కరించి నగర వాసులంతా మరో చోటకు వెళ్లిపోతున్నారు. ఎమర్జె్న్సీ లాక్ డౌన్ అమల్లోకి రావడానికి కొన్ని గంటల ముందే అందరూ నగరాన్ని దాటేస్తున్నారు. దాంతో రోడ్డు, రవాణాల రద్దీతో స్టేషన్ లు అన్నీ వార్ జోన్లుగా మారిపోయాయి.

వేలాది మంది లండన్ వాసులంతా సొంత వాహనాల్లో ఇతర రవాణా మార్గాల్లో నగరాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. దాంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ప్రొఫెసర్ క్రిస్ విట్టీ శనివారమే లండన్ వాసులను హెచ్చరించారు.  ఎవరూ బయటకు వెళ్లొద్దని సూచించారు. ఎవరైనా బయటకు వెళ్లేందుకు బ్యాగులు సర్దుకుంటే వెంటనే దించేయండని హెచ్చరించారు.
ఎవరూ కూడా నగరాన్ని విడిచి బయటకు వెళ్లేది లేదని అందరూ ఇళ్లలోనే ఉండాలని విట్టి హెచ్చరించారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆదేశాలను బేఖాతరు చేస్తూ లండన్ వాసులందరూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

దాంతో లండన్ వీధుల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. రైల్వే టర్మినల్స్ వద్ద భారీ ఎత్తునా క్యూ కట్టేస్తున్నారు. A40లో లండన్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ కొన్ని గంటల పాటు నిలిచిపోయింది. జాన్సన్ పిడుగువార్తను ప్రకటించగానే అందరూ వేరే ప్రాంతాలకు పరుగులు పెట్టడం మొదలుపెట్టేశారు.