Mega Millions Jackpot Lottery : లక్కున్నోడు.. రూ.162 తో రూ.10వేల కోట్లు గెల్చుకున్నాడు, ఎలాగంటే..

అతడిని లక్ష్మీదేవి కరుణించింది. అంతే, కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. లాటరీ రూపంలో కనక వర్షం కురిసింది. రూ.162తో లాటరీ టికెట్ కొంటే.. ఏకంగా రూ.10వేల కోట్లు వచ్చి పడ్డాయి.

Mega Millions Jackpot Lottery : లక్కున్నోడు.. రూ.162 తో రూ.10వేల కోట్లు గెల్చుకున్నాడు, ఎలాగంటే..

Updated On : January 15, 2023 / 11:08 PM IST

Mega Millions Jackpot Lottery : లక్ష్మీదేవి.. ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో చెప్పలేము. జీవితంలో ఏ క్షణమైనా మన ఇంటి డోర్ తట్టొచ్చు. లక్షీదేవి కరుణించాలే కానీ.. ఒక్కసారిగా ఆ వ్యక్తుల జీవితమే టర్న్ అయిపోతుంది. రాత్రికి రాత్రి లైఫే మారిపోతుంది. బిచ్చగాడు సైతం బిలియనీర్ అయిపోతాడు. నిరుపేద కూడా కోట్లకు పడగలెత్తుతాడు.

అమెరికాకు చెందిన ఆ వ్యక్తి విషయంలో ఇదే జరిగింది. అతడిని లక్ష్మీదేవి కరుణించింది. అంతే, కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. లాటరీ రూపంలో కనక వర్షం కురిసింది. రూ.162తో లాటరీ టికెట్ కొంటే.. ఏకంగా రూ.10వేల కోట్లు వచ్చి పడ్డాయి. ఏంటి షాక్ అయ్యారు కదూ.. కానీ, ఇది నిజం.

Also Read..Dubai Lottery: దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టిన తెలంగాణ వాసి.. రూ.338తో లాటరీ టికెట్ కొంటే 33 కోట్ల ప్రైజ్‌మనీ

వివరాల్లోకి వెళితే.. అమెరికా మెగా మిలియన్స్ జాక్ పాట్ లో ఓ వ్యక్తికి బంపర్ లాటరీ తగిలింది. మైనే స్టేట్ లోని లెబనాన్ కు చెందిన వ్యక్తి రూ.162 పెట్టి టికెట్ కొన్నాడు. లాటరీలో అతడి నెంబర్ వచ్చింది. దీంతో ఏకంగా రూ.10వేల 973 కోట్లు గెలుచుకున్నాడు.

Also Read..Dubai Shopping Festival : దుబాయ్‌లో షాపింగ్​ ఫెస్టివల్ .. 11 కిలోల బంగారం గెలుచుకున్న భారతీయులు

అయితే, విజేతకు సొమ్మును లాటరీ నిర్వాహకులు 29 వాయిదాల్లో చెల్లిస్తారు. అలా కాకుండా.. మొత్తం ఒకేసారి కావాలంటే మాత్రం సుమారు 7వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తారు. అది కూడా ట్యాక్స్ లన్నీ పోనూ చివరికి చేతికి అందేది రూ.3వేల కోట్లే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.