Louvre Heist: ప్యారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో నిన్న తెల్లవారుజామున నెపోలియం కాలం నాటి ఆభరణాల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ప్రతిరోజు దాదాపు 30 వేల మంది సందర్శించే ఈ మ్యూజియంలో ప్రపంచ ప్రఖ్యాత, చారిత్రక వస్తువులుంటాయి.
మోనాలీసా ఒరిజినల్ చిత్రం సైతం ఇక్కడే ఉంటుంది. ఈ మ్యూజియంలో చోరీ జరిగిన తీరు గురించి ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి రచ్చిదా దాటి వివరాలు తెలిపారు. (Louvre Heist)
“మేము ఈ దోపిడీ గురించి సమాచారం అందుకున్న కొన్ని నిమిషాలకే అక్కడకు చేరుకున్నాం. ఈ దోపిడీ సుమారు 4 నిమిషాల్లోనే జరిగింది. చాలా వేగంగా పనిని పూర్తి కానిచ్చేశారు. చోరీ చేసినవారు ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. ఇది షాకింగ్ ఘటన. ఇది సినిమా స్క్రిప్ట్‌లా ఉంది. చోరీ జరిగాక నిన్న లౌవ్రే మ్యూజియాన్ని ఒక్కసారిగా మూసివేయడంతో అక్కడ గందరగోళం నెలకొంది” అని చెప్పారు.
Also Read: నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్..
దోపిడీ తర్వాత మ్యూజియాన్ని పరిశీలించగా ఓ చోట ఒక్క రత్నం కనపడింది. దొంగలు తీసుకెళ్తుండగా అది జారి పడిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దాన్ని అధికారులు పరిశీలిస్తున్నారని రచ్చిదా దాటి తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
ఫ్రాన్స్ గొప్ప వారసత్వమున్న దేశమని, అధిక విలువచేసే వస్తువులు ఉన్న దేశమని అన్నారు. మ్యూజియాలు నేరస్థులకు లక్ష్యంగా మారాయని చెప్పారు. లౌవ్రే మ్యూజియంలో జరిగిన దోపిడీ తాము గౌరవించే వారసత్వంపై చేసిన దాడి అని, ఎందుకంటే అదే తమ చరిత్ర అని అన్నారు.
కాగా, దొంగలు నెపోలియన్ కాలంనాటి 9 రత్నాలను దొంగలు చోరీ చేయగా, వీటిలో ఒక రత్నాన్ని వారు మ్యూజియం వద్దే పోగొట్టుకున్నారని తెలుస్తోంది. ఆ ఒక్క రత్నమే అధికారులకు దొరికింది.