Luxury Cruise Ship : గ్రీన్‌ల్యాండ్‌లోని మారుమూల ప్రాంతంలో చిక్కుకుపోయిన 206 మంది ప్రయాణికులతో వెళ్తున్న లగ్జరీ క్రూయిజ్ షిప్

క్రూయిజ్ షిప్ ఆపరేటర్ ప్రయాణికులందరూ సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని తెలిపారు. ప్టెంబర్ 1న బయలుదేరిన మూడు వారాల క్రూయిజ్ షిప్ సెప్టెంబర్‌ 22న తిరిగి ఓడరేవుకు చేరుకోవాల్సి ఉంది.

Luxury Cruise Ship

Luxury Cruise Ship Stranded Greenland : గ్రీన్‌ల్యాండ్‌లోని మారుమూల ప్రాంతంలో 206 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న లగ్జరీ క్రూయిజ్ షిప్ చిక్కుకుపోయింది. 200 మందికి పైగా ప్రయాణికులు మరియు సిబ్బందితో కూడిన ఒక విలాసవంతమైన క్రూయిజ్ షిప్ గ్రీన్‌ల్యాండ్‌లోని మారుమూల ప్రాంతంలో చిక్కుకుపోయిందని ఇండిపెండెంట్ నివేదించింది. క్రూయిజ్ షిప్ ఆపరేటర్ ప్రయాణికులందరూ సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని తెలిపారు. అయితే శుక్రవారం వరకు రెస్క్యూ షిప్ రాలేదని చెప్పారు. సెప్టెంబర్ 1న బయలుదేరిన మూడు వారాల క్రూయిజ్ షిప్ సెప్టెంబర్‌ 22న తిరిగి ఓడరేవుకు చేరుకోవాల్సి ఉంది.

న్యూయార్క్ పోస్ట్ తెలిసిన వివరాల ప్రకారం ప్రయాణానికి ప్రయాణీకుల నుండి క్రూయిజ్ షిప్ 33,000 డాలర్లు వసూలు చేసింది. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం ఓషన్ ఎక్స్‌ప్లోరర్ అని పిలువబడే ఎక్స్‌పిడిషన్ క్రూయిజ్ షిప్ సోమవారం మధ్యాహ్నం సమయంలో గ్రీన్‌లాండ్ రాజధాని నౌక్ నుండి 850 మైళ్ల దూరంలో నిలిచిపోయింది. క్రూయిజ్ షిప్ ఓషన్ ఎక్స్‌ప్లోరర్ ఈశాన్య గ్రీన్‌ల్యాండ్‌లోని ఆల్పెఫ్‌జోర్డ్‌లో నిలిచిపోయిందని, స్వతాగా తనంట తాను కదల్లేదని సోమవారం మధ్యాహ్నం వెస్ట్ గ్రీన్‌లాండిక్ సమయానికి ఆర్కిటిక్ కమాండ్‌కి సందేశం వచ్చిందని డెన్మార్క్ జాయింట్ ఆర్కిటిక్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.

Student Drowns In Ganga : నిమిషాల్లో ఘోరం జరిగిపోయింది.. ఫ్రెండ్స్ కళ్ల ముందే చనిపోయాడు, వీడియో వైరల్

జాయింట్ ఆర్కిటిక్ కమాండ్ కూడా మంగళవారం ఆటుపోట్లు ఉన్నప్పటికీ ఓడ ఇప్పటివరకు విడిపించుకోలేకపోయిందని వెల్లడించింది. షిప్ లో ఎవరికీ తక్షణ ప్రమాదం లేదని, ఓడలో తగినంత సామాగ్రి ఉందని షిప్ ఆపరేటర్ అరోరా ఎక్స్‌పెడిషన్స్ చెప్పారు. సమీప సహాయం చాలా దూరంలో ఉందని తమ యూనిట్లు దూరంగా ఉన్నాయని, వాతావరణం చాలా ప్రతికూలంగా ఉందని డానిష్ మిలిటరీ జాయింట్ ఆర్కిటిక్ కమాండ్‌కు చెందిన బ్రియాన్ జెన్సన్ వెల్లడించారు. అయితే, ఈ నిర్దిష్ట పరిస్థితిలో మానవ జీవితానికి లేదా పర్యావరణానికి ఎటువంటి తక్షణ ప్రమాదం లేదని తెలిపారు. తాము పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఈ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని వెల్లడించారు.

ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ప్రకారం ఎక్కువ మంది వృద్ధ ప్రయాణీకులలో అనేక కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది ఆస్ట్రేలియన్లు ఉన్నారు.  “అందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కానీ, షిప్ చిక్కుకోవడం కొంచెం నిరాశపరిచింది. మనం ప్రపంచంలోని అందమైన భాగంలో ఉన్నాం. మా కిటికీని తెరిచినప్పుడు మేము హిమానీనదం దగ్గర కూర్చున్నాం” అని షిప్ లో ప్రయాణిస్తున్న రిటైర్డ్ ఆసి స్టీవెన్ ఫ్రేజర్ అతని భార్యతో చెప్పారు.

Boat Capsizes : కేప్‌ వెర్డే వద్ద సముద్రంలో బోల్తా పడిన పడవ…63మంది మృతి

ఓడలోని ప్రయాణికుల్లో చాలా మంది వృద్ధులు ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా రెండు కోవిడ్ కేసులు కూడా ఉన్నాయి కానీ, షిప్ లో ఒక వైద్యుడు ఉన్నారని పేర్కొన్నారు. అయితే, ఒక తనిఖీ నౌక చిక్కుకున్న క్రూయిజ్ షిప్ వైపు వెళుతోందని శుక్రవారం ఉదయం అడక్కడికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జాయింట్ ఆర్కిటిక్ కమాండ్ పరిస్థితి మారితే సహాయం అందించడానికి సమీపంలోని క్రూయిజ్ షిప్‌ను ఆ ప్రాంతంలోనే ఉండమని కోరినట్లు ఇన్‌సైడర్ నివేదించింది.

2021లో నిర్మించబడిన ఓషన్ ఎక్స్‌ప్లోరర్ 134 మంది ప్రయాణీకులకు వసతి కల్పించగల ఇన్ఫినిటీ-క్లాస్ నౌక. అరోరా ఎక్స్‌పెడిషన్స్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలోని అత్యంత అడవి, మారుమూల గమ్యస్థానాలకు యాత్రల కోసం ఓడ ఉద్దేశించబడింది. దీని తదుపరి ప్రయాణం అక్టోబర్ 30న అర్జెంటీనా నుండి బయలుదేరి అంటార్కిటికా అంతటా ప్రయాణించడానికి 12 రోజుల పర్యటన ఉంటుంది. ఒక్కో ప్రయాణికుడికి $13,395 ఖర్చు అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు