Student Drowns In Ganga : నిమిషాల్లో ఘోరం జరిగిపోయింది.. ఫ్రెండ్స్ కళ్ల ముందే చనిపోయాడు, వీడియో వైరల్

ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. అవి ఎంతో భయానకంగా ఉంటాయి. అసలేం జరిగిందో అర్థమయ్యేలోపే ప్రాణాలు పోతాయి. కళ్ల ముందే మృత్యువు ఒడిలోకి జారుకుంటారు. అలాంటి ఓ షాకింగ్ ఘటన ఒకటి హరిద్వార్ లో చోటు చేసుకుంది.

Student Drowns In Ganga : నిమిషాల్లో ఘోరం జరిగిపోయింది.. ఫ్రెండ్స్ కళ్ల ముందే చనిపోయాడు, వీడియో వైరల్

Student Drowns In Ganga : ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. అవి ఎంతో భయానకంగా ఉంటాయి. అసలేం జరిగిందో అర్థమయ్యేలోపే ప్రాణాలు పోతాయి. కళ్ల ముందే మృత్యువు ఒడిలోకి జారుకుంటారు. అలాంటి ఓ షాకింగ్ ఘటన ఒకటి హరిద్వార్ లో చోటు చేసుకుంది. కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడు. చూస్తుండగానే అతడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

గంగా నదిలో పవిత్ర స్నానానికి దిగిన ఓ విద్యార్థి ప్రాణం పోగొట్టుకున్నాడు. ఐఐటీ రూర్కీ విద్యార్థులు హరిద్వార్ లోని గంగా నదికి వచ్చారు. పవిత్ర స్నానం ఆచరించాలని అనుకున్నారు. అయితే, వారిలో సిద్ధార్ధ్ అనే విద్యార్థి ఊహించని రీతిలో ప్రాణం కోల్పోయాడు. అతడికి ఈత వచ్చు. అయినప్పటికీ నదిలో ప్రవాహం వేగంగా ఉండడంతో నదిలో కొట్టుకుపోయాడు.

Also Read..Student Dies Falling : షాకింగ్ వీడియో.. ఫ్రెండ్స్ కళ్ల ముందే చనిపోయాడు, రెప్పపాటులో ఊహించని ఘోరం

ఒడ్డున ఉన్న స్నేహితుల కళ్ల ముందే ఈ విషాదం జరిగింది. ప్రాజెక్ట్ కోసం వారు హరిద్వార్ కు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. సిద్ధార్ధ్ నదిలో ఉన్న సమయంలో ఒడ్డున ఉన్న మరో ఫ్రెండ్ ఫోన్ లో షూట్ చేశాడు. సిద్ధార్ధ్ ఈత కొట్టేందుకు మరింత ముందుకు వెళ్లాడు. అంతే, నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్ల ముందే స్నేహితుడు నీళ్లలో కొట్టుకుపోతున్నా.. పాపం ఫ్రెండ్స్ ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. తమ స్నేహితుడిని కోల్పోయిన దుఖంలో మునిగిపోయారు.

ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతుడిని సిద్ధార్ధ్ గెహ్లాట్ (21) గా పోలీసులు గుర్తించారు. అతడి స్వస్థలం రాజస్తాన్ లోని నాగౌర్ జిల్లా. ఐఐటీ రూర్కీలో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సిద్ధార్ధ్ తన నలుగురు స్నేహితులతో ఆదివారం ఉదయం గంగా ఘాట్ కి వచ్చాడు. నమామి ఘాట్ లో పవిత్ర స్నానం ఆచరించేందుకు సిద్ధార్ధ్ అతడి స్నేహితుడు నదిలోకి దిగారు.

Also Read..Naked Woman : బాబోయ్.. అర్థరాత్రి వీధుల్లో నగ్నంగా తిరుగుతూ ఇంటి డోర్లు తడుతున్న మహిళ, భయాందోళనలో స్థానికులు

అయితే, ఘాట్ దగ్గర ఉన్న మెట్ల నుంచి నదిలో మునక వేసేందుకు మరింత ముందుకు వెళ్లాడు. అదే అతడి పాలిట మృత్యువైంది. కాగా, ఐదుగురు స్నేహితుల్లో.. సిద్ధార్ధ్ కు తప్ప.. ఎవరికీ ఈత రాదు. అంతేకాదు, ఆ నది లోతు గురించి, ప్రవాహం గురించి అతడికే కాస్త అవగాహన ఉంది. దీంతో మిగతా వారు మెట్ల దగ్గరే ఉండిపోయారు. ముందుకెళ్లిన సిద్ధార్ధ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఫ్రెండ్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు, స్టేట్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది నదిలోకి దిగారు. రెస్క్యూ ఆపరేషన్ చేసి సిద్ధార్ధ్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పడవలో ఒడ్డుకి తీసుకొచ్చారు. ఓ ప్రాజెక్ట్ కోసం సిద్ధార్ధ్ అతడి స్నేహితులు, ఓ ప్రొఫెసర్ హరిద్వార్ కి వచ్చారు. చండీ ఘాట్ లోని ఓ ఆశ్రమ్ లో బస చేశారు. స్నానం చేసేందుకు నదిలోకి దిగి తమ కళ్ల ముందే స్నేహితుడు చనిపోవడాన్ని ఫ్రెండ్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. వారింకా ఆ షాక్ నుంచి బయటపడలేకపోతున్నారు. సిద్ధార్ధ్ ఇక లేడని తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు.

కళ్ల ముందే కొట్టుకుపోయాడు..