Boat Capsizes : కేప్‌ వెర్డే వద్ద సముద్రంలో బోల్తా పడిన పడవ…63మంది మృతి

కేప్ వెర్డే వద్ద సముద్రంలో పడవ బోల్తా పడడంతో 63 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో 38మంది శరణార్ధులు, వలసదారులను రక్షించారు. కేప్ వెర్డే వద్ద సముద్రంలో పడవ మునిగి 63 మంది మరణించారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.

Boat Capsizes : కేప్‌ వెర్డే వద్ద సముద్రంలో బోల్తా పడిన పడవ…63మంది మృతి

Boat Capsizes

Updated On : August 17, 2023 / 5:40 AM IST

Boat Capsizes : కేప్ వెర్డే వద్ద సముద్రంలో పడవ బోల్తా పడడంతో 63 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో 38మంది శరణార్ధులు, వలసదారులను రక్షించారు. కేప్ వెర్డే వద్ద సముద్రంలో పడవ మునిగి 63 మంది మరణించారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) తెలిపింది. సెనెగల్‌ నుంచి బయలుదేరిన వలసదారుల పడవ కేప్‌ వెర్డే వద్ద బోల్తా పడింది. (Boat Capsizes off Cape Verde) గినియా-బిస్సావు పౌరుడితో సహా 38 మందిని పడవ నుంచి రక్షించినట్లు సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Electricity Bill Scam : కరెంట్ బిల్లు కట్టలేదా? మీకు ఇలా మెసేజ్ వచ్చిందా? లింక్ క్లిక్ చేయగానే రూ.1.85 లక్షలు మాయం..!

సముద్రంలో 7 మృతదేహాలు లభించాయని కోస్ట్ గార్డ్ పేర్కొంది. సాల్ ద్వీపానికి దాదాపు 320 కిలోమీటర్ల దూరంలో స్పానిష్ ఫిషింగ్ బోట్ ద్వారా ఈ నౌక కనిపించింది. ప్రాణాలతో బయటపడిన వారిలో ఏడుగురిని ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఉందని సాల్‌లోని ఆరోగ్య అధికారి జోస్ రుయి మోరీరా తెలిపారు.

Crocodile Attacked : ఓ మై గాడ్.. స్నానం చేస్తుండగా మహిళపై మొసలి దాడి, రెప్పపాటులో దారుణం.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

కేప్ వెర్డే స్పానిష్ కానరీ దీవుల సముద్ర మార్గంలో ఉంది. యూరోపియన్ యూనియన్‌కు గేట్‌వే. వేలాది మంది శరణార్థులు, వలసదారులు(refugees and migrants) ప్రతి సంవత్సరం ప్రమాదకరమైన ప్రయాణం చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. జనవరిలో కేప్ వెర్డేలోని రెస్క్యూ బృందాలు 90 మంది శరణార్థులు, వలసదారులు కానోలో కొట్టుకుపోయారు.