చావు..పుట్టుకల్లేని గ్రామం: పుట్టకూడదు పూడ్చకూడదు 

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 09:16 AM IST
చావు..పుట్టుకల్లేని గ్రామం: పుట్టకూడదు పూడ్చకూడదు 

Updated On : March 24, 2019 / 9:16 AM IST

మాఫీ డవ్ : కొన్ని ప్రాంతాలలో ఉండే వింత వింత ఆచారాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. టెక్నాలజీ రోజు రోజుకీ అభివృద్ది చెందుతున్న తరుణంలో కూడా ఇటువంటి ఆచారాలు కొనసాగిస్తుండటం గమనించాల్సిన విషయం. భూమిమీద జరిగే చిన్న విషయాన్ని కూడా అంతరిక్షం నుంచి ఫోటోలు తీసి సమాచారాన్ని అందించే రాకెట్స్ శాంకేతికంగా దూసుకుపోతుంటే దక్షిణాఫ్రికాలోని దక్షిణ ఘనాలో ఉన్న మాఫీ డవ్ అనే గ్రామంలో కొనసాగుతున్న ఈ వింత ఆచారం ఆశ్చర్యం కలిగిస్తోంది. 
 

మాఫీ డవ్  గ్రామంలో మహిళలు ప్రసవించకూడదు (పిల్లలను కనకూడదు) అంతేకాదు  చనిపోయిన వారిని ఆ ఊరిలో పూడ్చి పెట్టకూడదు (ఖననం చేయకూడదు). అంతేకాదు ఈ గ్రామంలో కనీసం జంతువుల్ని కూడా పెంచుకోకూడదట. ఇటువంటి ఆంక్షలను గ్రామస్తులు వ్యతిరేకించకపోవడం గమనార్హం. 5 వేల మంది నివసించే మాఫీ డవ్ గ్రామంలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ గ్రామం గడ్డపై పుట్టలేదట.అలాగైతే ఆ గ్రామంలో మనుషులు ఎలా ఉన్నారు అనే కదూ మీ అనుమానం? ఆ గ్రామ మహిళలు గర్భం దాల్చవచ్చు..కానీ ప్రసవం మాత్రం అక్కడ జరగకూడదు. అంటే ప్రసవం రోజు దగ్గర పడే కొద్ది నెలల ముందే వారు వేరే గ్రామాలకు వెళ్లిపోతారు. అక్కడే బిడ్డను కని, బిడ్డ బొడ్డు తాడు ఊడిన తర్వాత మాత్రమే తిరిగి గ్రామానికి రావాలి. ఇక ఎవరైనా చనిపోయినట్లయితే.. వారిని ఆ గ్రామంలో పూడ్చి పెట్టరు.వేరే గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తారు.  
 

అంతేకాదు మాఫీ డౌవ్ లో ఎవ్వరూ జంతువుల్ని పెంచుకోకూడదు. అలాగని వారు నాన్ వెజ్ తినరా అంటే అదేంలేదు..చక్కగా తింటారు. ఎలాగంటే..జంతువుల్ని గ్రామానికి తీసుకొస్తారు..తీసుకొచ్చిన రోజునే వధించి తినేయాలి.ఒక్క రోజు ఎక్కువ ఉంచినా ఆ గ్రామ కట్టుబాట్లను అతిక్రమించినట్లే. దీని వెనుక ఓ కథ ఉంది. 

టాగ్బే గబెవొఫియా అకిటీ అనే వేటగాడు మొదటిసారిగా ఈ ప్రాంతాలో అడుగుపెట్టాడు. అప్పుడు ఆయనకు ఆకాశవాణి వినిపించి..మాఫీ డౌవ్ చాలా  ప్రశాంతమైన ప్రాంతమని, అక్కడ ప్రజలు జీవించాలంటే..పిల్లలను ప్రసవించకూడదని, జంతువుల్ని పెంచకూడదని, శవాలను పూడ్చిపెట్టకూడదనే నిబంధనలను పాటించాలని ఆకాశవాణి అకిటీకి చెప్పిందట. దీంతో అప్పటి నుంచి ఈ ఆచారాలను కొనసాగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. వీటిలో ఏ ఒక్క ఆచారాన్ని తప్పినా దేవుడికి కోపం వస్తుందని మాఫీ డౌవ్  గ్రామస్తులు నమ్ముతు..పాటిస్తు వస్తున్నారు.