కరోనాతో గాంధీ మనవడు మృతి

  • Publish Date - November 23, 2020 / 11:10 AM IST

Mahatma Gandhi’s great-grandson : కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఈ వైరస్ సోకుతోంది. కొంతమంది మరణిస్తున్నారు కూడా. తాజాగా..మహాత్మాగాంధీ మనవడు సతీష్ ధుపేలియా Johannesburg లో చనిపోయారు. న్యుమోనియాతో పాటు కోవిడ్ – 19తో ఆయన బాధ పడుతున్నారు.



నెల రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఆయన ఆదివారం కన్నుమూశారని ఆయన సోదరి ఉమా ధుపేలియా మెస్ట్రి వెల్లడించారు. ఆయన వయస్సు 66 ఏళ్లుగా తెలుస్తోంది. న్యుమోనియా వ్యాధితో బాధ పడుతున్న సందర్భంలోనే..కోవిడ్ -19 సోకిందని, అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.



https://10tv.in/mahatma-gandhis-alarm-pocket-watch-auctions/
ఆదివారం సాయత్రం కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు విడిచారని తెలిపారు. సతీష్ కు ఉమాతో పాటు మరో సోదరి కీర్తి మీనన్ ఉన్నారు. వీరు ముగ్గురు మహాత్మా గాంధీ రెండో కుమారుడు మనీలాల్ గాంధీ వారసులు. తీష్..మీడియా రంగంలో వీడియో గ్రాఫర్, ఫొటో గ్రాఫర్ గా పనిచేశారు.