కువైట్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ విమానం మలయాళి టెక్నిషియన్ ప్రాణం తీసింది. గ్రౌండ్ స్టాప్ వర్కింగ్ చేస్తున్న టెక్నిషియన్ ను బోయింగ్ 777-300 ఈఆర్ విమానం కొంతదూరం ఈడ్చుకెళ్లింది.
కువైట్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ విమానం మలయాళి టెక్నిషియన్ ప్రాణం తీసింది. గ్రౌండ్ స్టాప్ వర్కింగ్ చేస్తున్న టెక్నిషియన్ ను బోయింగ్ 777-300 ఈఆర్ విమానం కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన సోమవారం (మే 6, 2019) కువైట్ సిటీ ఎయిర్ పోర్టులో జరిగింది. మృతిచెందిన గ్రౌండ్ వర్క్ టెక్నిషియన్ కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఆనంద్ రామచంద్రన్ గా గుర్తించారు.
రన్ వే నిలిపిన బోయింగ్ కిందిభాగంలో వర్క్ చేస్తుండగా ఆనంద్ ను విమానం ఈడ్చుకెళ్లిందని, ఈ ఘటనలో అతడు మృతిచెందినట్టు కువైట్ ఎయిర్ వేస్ అధికారిక ట్విట్టర్ లో ప్రకటించింది. రన్ వే నుంచి టెర్మినల్ కు తరలించే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది, ప్రయాణికులు ఎవరూ లేరు. బోయింగ్ 777 విమానాన్ని ఎయిర్ పోర్ట్ స్కైయిర్ నుంచి టెర్మినల్ 4కు పరికరాలను తీసుకెళ్తుండగా ఆనంద్ ప్రమాదవశాత్తూ మృతిచెందినట్టు పేర్కొంది.
మలయాళి టెక్నిషియన్ ఆనంద్ మృతిపట్ల కువైట్ ఎయిర్ లైన్ విచారం వ్యక్తం చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపింది. మృతుడు ఆనంద్ కు భార్య సోఫియానా, ఒక కుమార్తె ఉంది.