Maldives : మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం! సంత‌కాల సేక‌ర‌ణ పూర్తి!

మాల్దీవుల అధ్య‌క్షుడు మహమ్మద్‌ ముయిజ్జు పై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం సిద్ధ‌మైంది.

Maldivian Opposition Party Readies Impeachment Motion Against President

మాల్దీవుల అధ్య‌క్షుడు మహమ్మద్‌ ముయిజ్జు పై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం సిద్ధ‌మైంది. ఆ దేశ పార్ల‌మెంట్‌లో మెజారీ ఉన్న మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ (ఎండీపీ) ఇందుకోసం సంత‌కాలు సేక‌రించింది. ఎండీపీ చెందిన ఓ ఎంపీ ఈ విష‌యాన్ని చెప్పిన‌ట్లు స్థానిక మీడియా తెలిపింది. డెమోక్రాట్ల భాగ‌స్వామ్యంతో ఎండీపీ సంతకాలు సేక‌రించిన‌ట్లు చెప్పింది. అధ్య‌క్షుడిపై అభిశంస‌న తీర్మానానికి ఎండీపీ, డెమోక్రాట్ల ప్ర‌తినిధుల‌తో స‌హా మొత్తం 34 మంది స‌భ్యులు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు తెలిపింది.

అధ్య‌క్షుడు మహమ్మద్‌ ముయిజ్జు చైనాకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న‌పై అవిశ్వాసాన్ని ప్ర‌వేశ‌ పెట్టేందుకు అవ‌స‌ర‌మైన అవ‌స‌ర‌మైన సంత‌కాలను ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షం మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ సేక‌రించింది.

First Ever Death Penality : నైట్రోజన్ గ్యాస్ తో దోషికి తొలిసారి మరణ శిక్ష.. 22 నిమిషాల తరువాత మృతి

అధ్య‌క్షుడు మహమ్మద్‌ ముయిజ్జు ఎంపిక చేసిన మంత్రి మండ‌లిని ఆమోదించేందుకు ఆదివారం స‌మావేశ‌మైన పార్ల‌మెంట్‌ అధికార, విపక్ష ఎంపీల తోపులాటలు, ముష్టిఘాతాలతో అట్టుడికింది. దీంతో ఓటింగ్ జ‌ర‌గ‌కుండ‌నే స‌భ ముగిసింది.

ఇక సోమ‌వారం మ‌రోమారు పార్ల‌మెంట్ స‌మావేశం కాగా ముగ్గురు మంత్రుల‌కు వ్య‌తిరేకంగా ఓటు వేసింది. ఆదేశ రాజ్యాంగం ప్ర‌కారం స‌ద‌రు మంత్రుల ప‌ద‌వులు పోయిన‌ట్లే. ఇప్పుడు అధ్య‌క్షుడు మహమ్మద్‌ ముయిజ్జు పై అభిశంస‌నకు విప‌క్షాలు నడుం క‌ట్టాయి. ప్ర‌భుత్వం ఎంపీలు, మంత్రుల తీరు స‌రిగ్గా లేద‌ని ఆరోపించాయి.

ట్రెండింగ్ వార్తలు