పిల్లి వల్లే నా భార్యకు గర్భం వచ్చింది, ఓ భర్త వింత వాదన

  • Published By: naveen ,Published On : July 29, 2020 / 03:24 PM IST
పిల్లి వల్లే నా భార్యకు గర్భం వచ్చింది, ఓ భర్త వింత వాదన

Updated On : July 29, 2020 / 4:48 PM IST

టైటిల్ చూసి షాక్ తిన్నారా? పిల్లి వల్ల గర్భం దాల్చడం ఏంటి? అనే అనుమానం కలిగింది కదూ. నిజమే, అలాంటి సందేహాలు, అనుమానాలు కలగడంలో తప్పులేదు. ఆ భర్త వాదనలోనూ తప్పు లేదు. అసలేం జరిగిందంటే..



శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ కండోమ్ ధరించాడు:
కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. మనం ఒకటి అనుకుంటే విధి మరొకటి తలుస్తుంది. ఆ దంపతుల విషయంలోనూ అదే జరిగింది. ప్రస్తుత కరోనా వైరస్ సీజన్ లో పిల్లలను కనడం సేఫ్ కాదని భావించి.. ఆ జంట రెండో బిడ్డను ఇప్పట్లో కనకూడదని నిర్ణయించుకుంది. పడక గదిలో భార్యతో శృంగారం సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రతిసారి కండోమ్ ధరించి శృంగారంలో పాల్గొన్నాడు. కానీ, ఓ రోజు పొరపాటు జరిగిపోయింది. ఏదైతే జరక్కూడదని ఆ భర్త అనుకున్నాడు అదే జరిగింది. అతడి భార్య గర్భం దాల్చింది. దీంతో అతడు షాక్ తిన్నాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలా జరిగిందేంటి? అని తల పట్టుకున్నాడు.

అసలేం జరిగింది అని తెలుసుకునే పనిలో పడ్డాడు. అప్పుడు తెలిసింది ఇదంతా తన పెంపుడు పిల్లి ఘనకార్యం అని. తన భార్య గర్భం ధరించడానికి కారణం తాము పెంచుకుంటున్న పిల్లి అని తెలిసి ఆ వ్యక్తి కంగుతిన్నాడు.

కండోమ్‌ని కొరికేసిన పిల్లి:
అసలేం జరిగిందో ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. ‘‘కొద్ది రోజుల కిందట మేము టామ్ అనే పిల్లిని ఇంటికి తెచ్చుకున్నాం. అది చాలా అల్లరిది. ఎప్పుడు నా బాత్రూమ్‌లోని డెస్కు సొరుగులో నిద్రపోయేది. ఎప్పుడు వెళ్లినా టామ్ ఆ సొరుగులోని వస్తువులను చిందరవందర చేసేది. ఓ రోజు నేను కండోమ్‌ల ప్యాకెట్ తెచ్చి ఆ సొరుగులో పెట్టాను. మళ్లీ చూసేసరికి అవన్నీ సొరుగు నుంచి కిందపడి ఉన్నాయి. టామ్ వాటిని సొరుగు నుంచి కిందపడేసి అందులో పడుకుంది. దీంతో నేను అవన్నీ తీసి వేరే చోట పెట్టాను. ఆ తర్వాత అలాగే వాటిని వాడేశాను. దీంతో నా ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది.

నా భార్య గర్భవతి అని తెలియగానే.. ఆ ప్యాకెట్లో కండోమ్‌లను పరిశీలించాను. ఆ కండోమ్‌లపై పిల్లి కొరికిన గుర్తులు ఉన్నాయి. కొన్నింటికి రంథ్రాలు ఉన్నాయి. ఆ రోజు నేను వాటిని చెక్ చేయకుండా వాడేశాను. బహుశా.. నేను చిరిగిన లేదా రంథ్రం ఉన్న కండోమ్‌ను వాడటం వల్ల వీర్యం ఆమెలోకి ప్రవేశించి గర్భం దాల్చి ఉండొచ్చు’’ అని ఆ భర్త వాపోయాడు.

పిల్లి వల్ల ప్లాన్ మెత్తం బెడిసికొట్టింది:
తన భార్యకు ప్రీక్లాంప్సియా (Preeclampsia-గర్భవతుల్లో వచ్చే అధిక రక్తపోటు సమస్య) ఉందని ఆ భర్త చెప్పాడు. అందువల్ల గర్భనిరోధక మాత్రలను వాడటం లేదని తెలిపాడు. కండోమ్ వాడి గర్భం రాకుండా జాగ్రత్త పడుతున్నా అని వివరించాడు. అయితే, ఆ పిల్లి వల్ల ప్లాన్ మొత్తం బెడిసి కొట్టిందని ఆదేదన వ్యక్తం చేశాడు. కండోమ్స్ ను చూసుకొని వాడినట్టు అయితే ఈరోజు ఇంత ఇబ్బంది వచ్చేది కాదు కదా అని బాధపడుతూ తన కథ మొత్తాన్ని బ్లాగ్ పేజీలో రాసుకొచ్చాడు ఆ వ్యక్తి.

తన భార్య గర్భం దాల్చినందుకు తనకు బాధగా ఏమీ లేదని, కాకపోతే ప్లానింగ్ దెబ్బతిన్నందుకే ఫీల్ అవుతున్నానని అతడు తెలిపాడు. ఈ న్యూస్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అయ్యో పాపం, ఎంత పని జరిగింది, ఆ పిల్లి ఎంత పని చేసింది, అని నెటిజన్లు వాపోయారు. అసలు మ్యాటర్ తెలిసి కొందరికి నవ్వు ఆగలేదు.