ట్యూనా చేప..దాని రేటు వింటే గుండె షేక్ అవుతుంది. ఈ చేపకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. చేపలు పట్టుకుని అమ్ముకునే వ్యాపారులకు అటువంటిది ఒక్క చేప దొరికితే చాలు. పంట పడినట్లే. అటువంటి ఎనిమిదిన్నర అడుగుల పొడవున్న ట్యూనా చేప దొరికితే కోట్లు కురినట్లే. దాని రేటు మార్కెట్ లో రూ.23 కోట్లకు పైగా ఉంటుంది. అంత ఖరీదైన ఓ ట్యూనా చేపను పట్టుకుని వదిలేశాడు ఓ వ్యక్తి. హా..అంటూ ఆశ్చర్యవేస్తుంది కదూ. డేవ్ ఎడ్వర్డ్స్ అనే వ్యక్తికి ఇంత భారీ ట్యూనా చేప లభించింది. కానీ దాన్ని పట్టుకుని మళ్లీ సముద్రంలోనే వదిలేశాడు. అంత ఖరీదైన చేప దొరికితే అమ్ముకోకుండా ఎందుకు వదిలేశాడో తెలుసుకుందాం..
డేవ్ ఎడ్వర్డ్స్ క్యాచ్ అండ్ రిలీజ్ కార్యక్రమం చేస్తుంటారు. అయితే అంత ఖరీదైన చేప పట్టి చివరకు మళ్లీ నీళ్లలో వదిలేయడం ఆశ్చర్యం. ఎన్నిమిదిన్నర అడుగుల ట్యూనా చేప. బరువు 270 కిలోలు. మార్కెట్ లో దాని ఖరీదు రూ.23 కోట్లకు పైనే. డేవ్ కు ఈ చేప దొరికింది. కానీ దాన్ని వదిలేశాడు.
ఈ సందర్భంగా డేవ్ మాట్లాడుతూ..ఐర్లాండ్ తీరంలో 8.5 అడుగుల భారీ ట్యూనా చేప తమ వలకు చిక్కింది. తాము సరదా కోసమే చేపలు పడుతున్నామని, వాటిని అమ్మడం ఉద్దేశం కాదని చెప్పాడు. అట్లాంటిక్ జలాల్లో ఎలాంటి చేపలు ఉన్నాయో తెలుసుకోవడానికే ఇలా చేపలను పట్టి వదిలేస్తున్నామని తెలిపాడు. చేపల్ని పట్టుకొని వదిలేసే కార్యక్రమం అక్టోబర్ 15 వరకూ సాగనుంది. ఇందులో మొత్తం 15 బోట్లు పాల్గొంటున్నాయి.ఈ సంవత్సరంలో ఐర్లాండ్‌లో వలకు చిక్కిన అతి పెద్ద ట్యూనా చేప ఇదే.
ఈ భారీ ట్యూనా చేపల ఫోటోలను వారు తమ ఫేస్‌బుక్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అంత ఖరీదైన చేపను వదిలేయడంతో డేవ్‌ని అందరూ ప్రశంసిస్తున్నారు.