New York’s Times Square : న్యూయార్క్ వీధుల్లో ‘డ్రోన్ మ్యాన్’ సందడి

డ్రోన్ పై ఓ మనిషి గాలిలో తిరగడం అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. ఈ ఘటన న్యూయార్క్ మహానగరంలో చోటు చేసుకుంది. డ్రోన్ పై నిలబడి ఎంచక్కా..ఎంజాయ్ చేస్తూ..వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

Drone

Times square Drone : డ్రోన్…గాలిలో ఎగిరే అత్యాధునిక పరికరం. దీని ద్వారా..ఎన్నో పనులు చేసుకుంటున్నారు. మనిషి వెళ్లలేని గమ్యస్థానానికి వీటిని పంపిస్తున్నారు. అయితే..డ్రోన్లపై మనిషి వెళ్లడం ఎక్కడైనా చూశారా ? అంటే..ఆశ్చర్యం వేస్తుంది కదు. కానీ నిజం..డ్రోన్ పై ఓ మనిషి గాలిలో తిరగడం అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. ఈ ఘటన న్యూయార్క్ మహానగరంలో చోటు చేసుకుంది. డ్రోన్ పై నిలబడి ఎంచక్కా..ఎంజాయ్ చేస్తూ..వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

న్యూయార్క్..అందమైన నగరాల్లో ఇది ఒకటి. మార్కెట్లు అన్నీ సందడి సందడిగా ఉంటాయి. రాత్రి వేళ..డ్రోన్ పై ఓ మనిషి వెళుతుండడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. Morgan Nevins వ్యక్తి..దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అయిపోయింది. దీనిని చాలా మంది రీ ట్వీట్ చేశఆరు. పది సెకన్ల పాటు ఈ వీడియో ఉంది. డ్రోన్ పై ఎలాంటి భయం లేకుండా..హెల్మెట్ ధరించి దూసుకెళుతున్నాడు. భూమికి పది అడుగుల ఎత్తులో ఎగురుతూ వెళ్లడం కనిపించింది.

జూన్ 19వ తేదీన దీనిని చిత్రీకరించారు. Rex Chapman ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడంతో దాదాపు 7 మిలియన్ కు పైగా వ్యూస్ రావడం విశేషం. ఇలా చేయడానికి తనకు చాలా రోజుల సమయం పట్టిందని,  ఈ డ్రోన్ అత్యాధునిక పరికరంగా Hunter Kowald అభివర్ణించారు. సురక్షితంగా, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండటానికి చాలా కష్టపడ్డామని వెల్లడించారు. డ్రోన్ పై తాను ఎలాంటి సమస్య లేకుండా సురక్షితంగా భూమి మీదకు ల్యాండ్ అవుతానని తెలిపారు. స్టంట్ చేసే ముందు అన్నీ అనుమతులు తీసుకోవడం జరిగిందని, డ్రోన్ పై వెళ్లే సమయంలో తమ చుట్టూ చాలా మంది ఉన్నారని తెలిపారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Hunter Kowald విషయానికి వస్తే..సాహసాలతో కూడిన వీడియోలను యూ ట్యూబ్ లో పోస్టు చేస్తుంటారు.