Proposal
Proposal gone wrong : అందరిముందు యువతికి ప్రపోజ్ చేద్దామని అనుకున్నాడు. తన ప్రపోజ్ కు యువతి ఎస్ చెబుతుందని..కౌగిలించుకుంటుందని ఆ యువకుడు ఊహించుకున్నాడు. కానీ ఆ యువతి చేసిన పనితో దిమ్మతిరిగే షాక్ తగిలింది. అందరిముందు బిక్కమొహం వేశాడు.
Read More : Hyderabad : బాలానగర్ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.
తాము ప్రేమించిన వారికి వినూత్నంగా ప్రపోజల్స్ చేస్తుంటారు. అనూహ్యంగా వారి ముందుకు వచ్చి..మోకాళ్లపై కూర్చొని గులాబీ పువ్వును అందిస్తుంటారు. ఇలాంటి సీన్స్ ఎన్నో చూశాం. సరిగ్గా ఇలాంటే ఓ ఘటన ఒకటి యూఎస్ లో చోటు చేసుకుంది. Massachusetts ప్రాంతంలో Worcester బేస్ బాల్ పార్క్ ఒకటి ఉంది. గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతోంది. ప్రేక్షకులు కూర్చొన గ్యాలరీ పై భాగంలో ఓ యువకుడు మోకాళ్లపై కూర్చొన్నాడు. అతనికి ఎదురుగా ఓ యువతి నిల్చొని ఉంది.
Read More : Tiruvannamalai Girivalam : తిరువణ్ణామలై పౌర్ణమి గిరి ప్రదక్షిణ రద్దు-జిల్లా కలెక్టర్
యువకుడి చేతిలో ఉన్న ఉంగరాన్ని చూసి యువతి షాక్ కు గురైంది. వెంటనే పక్కకు జరగండి అంటూ..ఆ యువతి కిందకు దిగి వెళ్లిపోవడంతో సదరు యువకుడు షాక్ తిన్నాడు. దీనిని wtwmass ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. నెటిజన్లు వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. యువకుడి పట్ల చాలా మంది చింతిస్తుండగా..నో చెప్పే హక్కు స్త్రీలకు ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రైవేటుగా జరగాలని, బహిరంగంగా కాదని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.