Florida : మహిళల లోదుస్తుని మాస్క్‌‌గా ధరించాడు..ఎందుకో కారణం చెప్పాడు

ఆ వ్యక్తి ధరించిన మాస్క్ పై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిని తొలగించి మాస్క్ వేసుకోవాలని విమాన సిబ్బంది సూచించారు. తాను మాత్రం తీసేది లేదని ఖరాఖండిగా చెప్పాడు...దీంతో...

Mask Must

Florida : కరోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతుండగానే..కొత్త వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. దీంతో పలు దేశాలు ఆంక్షల వలయంలోకి వెళుతున్నాయి. విమానరాకపోకలపై నిబంధనలు విధిస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, విమాన ఎక్కే సమయంలో..రెండుసార్లు కరోనా డోస్ తీసుకున్నట్లు రిపోర్టు చూపించాలని ఆదేశిస్తున్నారు. తాజాగా..ఓ వ్యక్తిని విమానం నుంచి దిగేయాలని సిబ్బంది సూచించారు.

Read More : Pakistan : బ్రేకింగ్ న్యూస్, కరాచీలో పేలుడు..10 మంది మృతి

ఆ వ్యక్తి ధరించిన మాస్క్ పై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ వ్యక్తి ధరించింది మహిళలు ఉపయోగించే లో దుస్తు కావడంతో సిబ్బంది అలా చెప్పాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికా ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది. ఫోర్ట్ లౌడెర్ డెల్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అడమ్ జేన్ అనే వ్యక్తి మహిళలు లోదుస్తును మాస్క్ గా ధరించి సీట్లో కూర్చొన్నాడు. ఇది గమనించిన సిబ్బంది…దానిని తొలగించి మాస్క్ వేసుకోవాలని సూచించారు. తాను మాత్రం తీసేది లేదని ఖరాఖండిగా చెప్పాడు.

Read More : Pakistan Prime Minister : ఇమ్రాన్ ఇంటి ఖర్చులు నెలకు 50 లక్షలు – వజీవుద్దీన్ అహ్మద్

దీంతో అతడిని విమానంలో నుంచి దించేశారు. దీనిపై ఎయిర్ లైన్స్ సంస్థ సీరియస్ అయ్యింది. మాస్క్ నిబంధనలు ఉల్లంఘించాడని పేర్కొంటూ…అతడిపై నిషేధం విధించింది. దీనిపై జేస్ మాట్లాడుతూ…విమానంలో తినే సమయంలో..తాగేటప్పుడు కూడా మాస్క్ ధరించాలని చెబుతున్నారని..తాను నిరసన తెలియచేయాలని…ఇలా చేయడం జరిగిందని వివరణనిచ్చారు.