Mark Zuckerberg
Meta Platforms Inc CEO Mark Zuckerberg : మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని మోకాలికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ సమయంలో ఆయన గాయపడ్డాడు. ఆస్పత్రి వైద్యులు అతన్ని పరీక్షించి మోకాలికి తీవ్ర గాయమైందని గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే, ఈ విషయంపై జుకర్ బర్గ్ తన ఇన్ స్టాగ్రామ్ లో తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిత్రాలను పోస్టు చేశారు. ఆస్పత్రిలో ఉండటానికి కారణం, తదితర వివరాలను వెల్లడించారు.
Also Read : Sri Lanka Cricket: మరీ ఇంత చెత్తాటా..! ఆ ఓటములకు కారణమేమిటో వివరణ ఇవ్వండి
జుకర్ బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ప్రకారం.. నా ACL (Anterior cruciate ligament)ని తొలగించి దానిని భర్తీ చేయడానికి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు తెలిపారు. వైద్యులు, వైద్యబృందం జాగ్రత్తగా చూసుకున్నందుకు జుకర్ బర్త్ కృతజ్ఞతలు తెలిపాడు. నేను వచ్చే ఏడాది ప్రారంభంలో MMA (మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్) పోటీకోసం శిక్షణ పొందుతున్నాను. ఈ క్రమంలో నా మోకాలికి గాయమైంది. ఇప్పుడు అది కొంచెం ఆలస్యమైంది. ఇంకా శిక్షణ పొందడానికి ఎదురు చూస్తున్నాను. నేను కోలుకున్న తర్వాత పోటీలో పాల్గొనేందుకు మళ్లీ శిక్షణ ప్రారంభిస్తానని జూకర్ బర్గ్ అన్నారు. మీ ప్రేమ, మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ జూకర్ బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.