Sri Lanka Cricket: మరీ ఇంత చెత్తాటా..! ఆ ఓటములకు కారణమేమిటో వివరణ ఇవ్వండి

భారత్ జట్టుపై శ్రీలంక 302 భారీ పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ జట్టు ఆటగాళ్లు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయారు. దీంతో శ్రీలంక జట్టు ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి.

Sri Lanka Cricket: మరీ ఇంత చెత్తాటా..! ఆ ఓటములకు కారణమేమిటో వివరణ ఇవ్వండి

Srilanka Team

ODI World Cup 2023 : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా శ్రీలంక జట్ట ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చలేదు. ఫలితంగా ఆ జట్టు సెమీ ఫైనల్ లోకి వెళ్లేందుకు అర్హత సాధించలేక పోయింది. ఈ మెగాటోర్నీలో శ్రీలంక ఏడు మ్యాచ్ లు ఆడగా.. కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఇండియాతో జరిగిన మ్యాచ్ లలో ఓటమిపాలవ్వగా.. నెదర్లాండ్స్, ఇంగ్లాండ్ జట్లపై మాత్రమే విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంకా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో ఆడాల్సి ఉంది. ఈ టోర్నీలో మొదటి నుంచి శ్రీలంక జట్ట చెత్త ప్రదర్శన ఇచ్చింది.

Also Read : Rachin Ravindra: సత్తా చాటిన కివీస్ ఓపెనర్.. రచిన్ రవీంద్ర ఖాతాలో మరో ఘనత

ముఖ్యంగా భారత్ జట్టుపై శ్రీలంక 302 భారీ పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ జట్టు ఆటగాళ్లు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయారు. దీంతో శ్రీలంక జట్టు ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో భారత్ పై భారీ ఓటమి తరువాత శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) కీలక ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి జట్టు ప్రదర్శన దిగ్భ్రాంతికి గురిచేసింది. జట్టు సన్నద్ధత, వ్యూహాలు, పనితీరు గురించి ముఖ్యమైన ప్రశ్నలను ఎస్ఎల్సీ లేవనెత్తింది. మొత్తం కోచింగ్ సిబ్బంది, సెలెక్టర్ల నుంచి అత్యవసర, సమగ్ర వివరణ ఇవ్వాలని శ్రీలంక క్రికెట్ కోరింది. నియమాలు నిబంధనల ప్రకారం.. వారి విధులు, బాధ్యతలను నిర్వహించడానికి నియమించబడిన ప్రొపెషనల్ సిబ్బందితో ఎస్ఎల్సీ నిర్వహణ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. అయినప్పటికీ ఎస్ఎల్పీ జవాబుదారీతనం, పారదర్శకత, సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రాముఖ్యత అని పేర్కొంది.

Also Read : Hardik Pandya: టీమిండియాకు బిగ్ షాక్.. వన్డే వరల్డ్ కప్ నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. యువ బౌలర్ ఎంట్రీ

వన్డే ప్రపంచ కప్ 2023లో శ్రీలంక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక, ఫాస్ట్ బౌలర్లు మతీషా పతిరనా, లహిరు కుమార్ మెగా టోర్నీలో మ్యాచ్ లకు దూరమయ్యారు. వారి స్థానంలో కరుణరత్నే, ఏంజెలలో మ్యాథూస్, ధుస్మంత చమీరాలను తుది జట్టులో చేరాల్సి వచ్చింది. మరోవైపు కెప్టెన్ గా కుశాల్ మెండిస్ బరిలోకి దిగాడు. శ్రీలంక చెత్త ప్రదర్శన మధ్య కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయి. భారత్ పై ఎడమచేతి వాటం బ్యాటర్ దిల్షాన్ మధుశంక ఐదు వికెట్లు తీసి ఈ ప్రపంచ కప్ లో వికెట్ల విభాగంలో అగ్రస్థానంలో ఉన్నాడు. సదీర సమరవిక్రమ శ్రీలంక టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాతుమ్ ఓపెనర్ గా నిస్సాంక మెరుగయ్యాడు