Hardik Pandya: టీమిండియాకు బిగ్ షాక్.. వన్డే వరల్డ్ కప్ నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. యువ బౌలర్ ఎంట్రీ

హార్ధిక్ పాండ్య స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ భారత్ జట్టులో చేరనున్నాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ కు ప్రసిద్ధ్ కృష్ణ అందుబాటులో ఉండనున్నాడు.

Hardik Pandya: టీమిండియాకు బిగ్ షాక్.. వన్డే వరల్డ్ కప్ నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. యువ బౌలర్ ఎంట్రీ

Hardik Pandya

Updated On : November 4, 2023 / 11:27 AM IST

ODI World Cup 2023: టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయం నుంచి కోలుకోలేక పోవడంతో స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ నుంచి దూరమయ్యాడు. పూణెలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎడమ చీలమండ గాయంతో హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. ఆ తరువాత భారత్ ఆడిన మ్యాచ్ లకు హార్దిక్ దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిన తరువాత గాయం నుంచి అతను కోలుకుంటున్నాడని వార్తలు వచ్చాయి.

Also Read : PAK Vs NZ Match Prediction: గెలిస్తేనే నిలిచేది..! పాక్ సెమీస్ ఆశలు నిలుపుకుంటుందా? గత రికార్డుల్లో ఏ జట్టుది పైచేయి అంటే..

హార్దిక్ పాండ్య గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడని, లీగ్ దశలో మ్యాచ్ లకు జట్టుకు అందుబాటులో లేకపోయినప్పటికీ.. సెమీ ఫైనల్ మ్యాచ్ లకు తుదిజట్టులో పాండ్య చేరుతాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా, హార్దిక్ గాయం నుంచి కోలుకోవటం కష్టమని భావించిన టీం మేనేజ్ మెంట్ వన్డే వరల్డ్ కప్ నుంచి అతనికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో టోర్నీలోని మిగిలిన మ్యాచ్ లకు హార్దిక్ దూరమైనట్లు ఐసీసీ ధ్రువీకరించింది. అతని స్థానంలో యువ పాస్ట్  బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ భారత్ జట్టులో చేరనున్నాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ కు ప్రసిద్ధ్ కృష్ణ అందుబాటులో ఉండనున్నాడు.

Also Read : ODI World Cup 2023 : శుభ్‌మ‌న్ గిల్‌, ఇషాన్ కిష‌న్ ల ఆన్ ఫీల్డ్ ప్రేమ.. మీమ్స్ వైర‌ల్‌

ప్రసిద్ధ్ కృష్ణ ప్రపంచ కప్ ముందు ఆస్ట్రేలియాపై తొమ్మిది ఓవర్లలో 1/45 స్కోరుతో డేవిడ్ వార్నర్ వికెట్ ను తీశాడు. కృష్ణ భారతదేశం తరపున 17 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. భారత్ పేస్ విభాగం జస్ప్రిత్ బూమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లతో బలంగా ఉంది. ప్రస్తుతం ప్రసిద్ధ్ కృష్ణ కూడా చేరనున్నాడు. ఇదిలాఉంటే.. టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023లో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో, నవంబర్ 12న నెదర్లాండ్స్ జట్టుతో తలపడనుంది.