యజమానికే ఝలక్: ఫేస్‌బుక్‌లో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ పోస్ట్‌లనే తీసేశారు

  • Publish Date - March 31, 2019 / 02:00 AM IST

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ పొరపాటున కొన్ని పోస్ట్‌లను తొలగించింది. అయితే ఫేస్‌బుక్ తొలగించింది ఎవరి పోస్ట్‌లనో తెలుసా? ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్‌వి. అవును ఇది నిజమే. ఫేస్‌బుక్ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌కు సంబంధించిన ఖాతా నుండి 2007 నుంచి 2008 మధ్యలో కాలంలో చేసిన పోస్టులు పొరపాటున డిలీట్ అయ్యాయని, సాంకేతిక కారణాల వల్ల ఇటువంటి పని జరిగిందని, అయితే వాటిని మళ్లీ తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తామంటూ ఫేస్‌బుక్ ప్రతినిధులు చెబుతున్నారు.
Read Also : ‘నాసా’ బంపర్ ఆఫర్ : ‘నిద్ర’ ప్రియులకు లక్షలిస్తాం

అయితే అవి మళ్లీ డిలేట్ అయిన పోస్ట్‌లను రాబట్టగలం అనే స్పష్టమైన హమీ మాత్రం ఇవ్వలేమని అంటున్నారు. అంతేకాదు డిలిట్ అయిన ఫేస్‌బుక్ పోస్ట్‌లు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అవి ఎన్ని అనే విషయంలో కూడా క్లారిటీ లేదని ఫేస్‌బుక్ వెల్లడించింది. ఇటీవలికాలంలో అనేక వివాదాలు మూటగట్టుకుంటున్న ఫేస్‌బుక్ డేటా భద్రత లేదు అన్న అంశం తర్వాత ఇలా కంపెనీ సీఈవో పోస్ట్‌లే డిలీట్ అవడం ఇబ్బందికర పరిణమామమేనని అమెరికన్ మీడియా సంస్థ ఒకటి తన కథనంలో అభిప్రాయపడింది. 
Read Also : కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ