Indonesia Earthquake : భీకర భూకంపం.. 162మంది దుర్మరణం, కోట్లలో ఆస్తి నష్టం, ఇండోనేషియాలో తీవ్ర విషాదం

భీకర భూకంపం ఇండోనేషియాను కుదిపేసింది. తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరణాల సంఖ్య 162కి పెరిగింది.

Indonesia Earthquake : భీకర భూకంపం ఇండోనేషియాను కుదిపేసింది. తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరణాల సంఖ్య 162కి పెరిగింది. 700 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా వందల మంది శిథిలాల కిందే ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.6గా నమోదైంది. భూకంప తీవ్రతకు పెద్ద సంఖ్యలో ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. కోట్లల్లో ఆస్తి నష్టం సంభవించినట్లు నిర్ధారించారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

భారీ భూకంపం జావా ద్వీపాన్ని అల్లకల్లోలం చేసింది. జావా సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం సంభవించిన ప్రాంతాలు భయానకంగా మారాయి. ఇండోనేషియాలో కీలక పట్టణాలు జావా, సియాన్ జర్ శిథిలాల దిబ్బగా మారాయి. ఎటు చూసినా గాయపడిన వారే కనిపిస్తున్నారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం నిండిపోయింది.

అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ఫిబ్రవరిలో కూడా ఇండోనేషియాలో భూకంపం వచ్చింది. అప్పుడు 6.2గా తీవ్రత నమోదైంది. ఇప్పుడు వచ్చింది 5.6 తీవ్రతే అయినా.. నగరానికి సమీపంలో రావడంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.

ట్రెండింగ్ వార్తలు