Israeli Soldiers : ఇజ్రాయెల్ సైనికులకు మెక్‌డొనాల్డ్స్ ఉచిత భోజనం…లెబనాన్‌లో వెల్లువెత్తిన నిరసనలు

హమాస్‌పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ సైనికులకు మెక్‌డొనాల్డ్స్ ఉచిత భోజనం అందిస్తోంది. హమాస్‌పై సాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ సైనికులకు ఫాస్ట్ ఫుడ్ చైన్ ఉచిత భోజనాన్ని అందజేస్తుందని ప్రకటించిన తర్వాత మెక్‌డొనాల్డ్స్ పై లెబనాన్‌లో నిరసనలు వెల్లువెత్తాయి....

McDonalds Free Meals To Israeli Soldiers

Israeli Soldiers : హమాస్‌పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ సైనికులకు మెక్‌డొనాల్డ్స్ ఉచిత భోజనం అందిస్తోంది. హమాస్‌పై సాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ సైనికులకు ఫాస్ట్ ఫుడ్ చైన్ ఉచిత భోజనాన్ని అందజేస్తుందని ప్రకటించిన తర్వాత మెక్‌డొనాల్డ్స్ పై లెబనాన్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఇజ్రాయెల్ మెక్‌డొనాల్డ్స్ ఆ దేశ డిఫెన్స్ ఫోర్సెస్‌లోని ఆసుపత్రులు, దళాలకు ఉచిత భోజనాన్ని ఇస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. ‘‘ఇప్పటికే మేం ఆసుపత్రులు, సైనిక విభాగాలకు చెందిన 4వేల మందికి భోజనాలను విరాళంగా అందించాం, ఫీల్డ్‌లో ఉన్న సైనికులకు ప్రతిరోజూ భోజనం పెట్టాలని మేం భావిస్తున్నాం, దీనికోసం ప్రత్యేకంగా అయిదు రెస్టారెంట్లను ప్రారంభించాం’’ అని మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్ పేర్కొంది.

Also Read :Boat Capsizes : కాంగోలో పడవ బోల్తా..27మంది మృతి

చాలామంది వినియోగదారులు మెక్‌డొనాల్డ్స్ చర్యను విమర్శించారు. ‘‘గాజాలో యుద్ధ బాధితులకు కాకుండా మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్‌కు ఉచితంగా భోజనం పెడుతుంది, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ మెక్‌డొనాల్డ్స్‌ను బహిష్కరించాలని నేను భావిస్తున్నాను’’ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. మరో వైపు కొంతమంది నెటిజన్లు ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఫాస్ట్ ఫుడ్ చైన్‌ మెక్‌డొనాల్డ్స్ ను ప్రశంసించారు. ‘‘బాగా చేశారు మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్’’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

Also Read :Asaduddin Owaisi : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ దళాలకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఆహార దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ చర్యకు వ్యతిరేకంగా అక్టోబర్ 13వతేదీన లెబనాన్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. స్పిన్నీస్‌లోని మెక్‌డొనాల్డ్స్ పై పాలస్తీనియన్ గ్రూపులు దాడి చేశాయి. ఈ నేపథ్యంలో ఒమన్ మెక్‌డొనాల్డ్స్ గాజాకు మద్ధతు తెలుపుతూ ఎక్స్ లో పోస్టు పెట్టింది. గాజాలోని ప్రజల సహాయ చర్యల కోసం కంపెనీ 100,000 డాలర్లను విరాళంగా అందించామని మెక్‌డొనాల్డ్స్ ఒమన్ తెలిపింది.

Also Read :Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి 197 మంది భారతీయులతో ఢిల్లీ వచ్చిన మూడో విమానం

‘‘ఈ క్లిష్ట సమయాల్లో మనం గాజాకు మద్ధతుగా నిలబడతాం. మనమందరం గాజాలోని ప్రజలకు మద్ధతు ఇద్దాం. అరబ్, ముస్లిం దేశాలను అన్ని చెడుల నుంచి రక్షించమని మేం సర్వశక్తిమంతుడైన దేవుడిని కోరుతున్నాం’’ అని మెక్‌డొనాల్డ్స్ ఒమన్ పేర్కొంది. మరో వైపు గాజాలో సహాయక చర్యల కోసం కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి 250,000 డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు మెక్‌డొనాల్డ్స్ కువైట్ తెలిపింది.

Also Read :Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి 197 మంది భారతీయులతో ఢిల్లీ వచ్చిన మూడో విమానం

అక్టోబర్ 7 వతేదీన పోరాటం చెలరేగినప్పటి నుంచి గాజాలో 724 మంది పిల్లలతో సహా మొత్తం 2,215 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ అధికారులు తెలిపారు. ఇదే కాలంలో ఇజ్రాయెల్‌లో 1,300 మంది మరణించారు.

Also Read :Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం…12 మంది మృతి, 23మందికి గాయాలు