Telangana : ఎన్నికల వేళ భారీగా నగదు, బంగారం, మద్యం పట్టివేత

ఆయా జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో నిర్వహిస్తున్న సోదాల ద్వారా శనివారం రూ.74,95,31,197 నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి ఆభరణాలు, ఇతర సామాగ్రి పట్టుబడింది.

Telangana : ఎన్నికల వేళ భారీగా నగదు, బంగారం, మద్యం పట్టివేత

money and liquor seized

Updated On : October 15, 2023 / 12:26 AM IST

Telangana Money and Liquor Seized : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా నగదు, బంగారం, మద్యం పట్టుబడింది. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఆయా జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో నిర్వహిస్తున్న సోదాల ద్వారా శనివారం రూ.74,95,31,197 నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి ఆభరణాలు, ఇతర సామాగ్రి పట్టుబడింది. తనిఖీలు ప్రారంభించిన నాటి నుంచి శనివారం (అక్టోబర్14,2023)వ తేదీ రాత్రి వరకు సుమారు రూ.48,32,99,968 నగదు పట్టుబడింది.

Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఖరారు

రాష్ట్ర సరిహద్దులో పోలీసు, రవాణా శాఖ, కమిర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, అటవీశాఖలు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులతోపాటుగా, ఆయా జిల్లా కేంద్రాలు, సరిహద్దులు, మండల కేంద్రాల్లో నిత్యం నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుడుతున్నాయి.

ఈ తనిఖీల ద్వారా రూ.17,50,02,116 విలువైన వజ్రాలు, బంగారు, వెండి నగలు, ఇతర ఆభరణాలు పట్టుబడటం గమనార్హం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తనిఖీ బృందాలు క్రియాశీలకంగా విధులు నిర్వర్తిస్తున్నాయి.