McDonald : బర్గర్‌లో ఎలుక వ్యర్ధాలు .. మెక్‌డొనాల్డ్‌కు రూ. 5 కోట్లు జరిమానా
మెక్‌డొనాల్డ్ కు కస్టమర్ భారీ షాకిచ్చాడు. ఆర్డర్ చేసిన చీజ్ బర్గర్ లో ఎలుక వ్యర్ధాలు రావటంతో మెక్‌డొనాల్డ్ 4.89 కోట్లకు పైగా జరిమానా విధించారు.

mcdonald burger
McDonald : మెక్‌డొనాల్డ్ (McDonald). బర్గర్ల ( burge)కు పెట్టింది పేరు. మెక్‌డొనాల్డ్ బర్గర్లంటే (McDonald burges)ఎంతోమంది లొట్టలేసుకుంటు తింటారు. అంతర్జాతీయంగా మెక్‌డొనాల్డ్ కు మంచి డిమాండ్ ఉంది. మరి ఇంత డిమాండ్ ఉండి ఏం లాభం.. ఆహారపదార్ధాలు తయారీ చేసే చోట మాత్రం గబ్బుగబ్బుగా ఉందనే విషయం బయటపడింది.
లండన్ లో ఓ కస్టమర్ ఆర్డర్ చేసిన చీజ్ బర్గర్ లో ఎలుక వ్యర్ధాలు రావటంతో షాక్ అయ్యాడు. దీంతో ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసుకున్న బర్గర్ లో ఎలుక వ్యర్ధాలు చూసి ఖంగుతిన్న కష్టమర్ ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా తనిఖీలు చేపట్టిన అధికారులు మెక్‌డొనాల్డ్ (McDonald) అవుట్‌లెట్‌కు రూ 4.89 కోట్లకు పైగా జరిమానా విధించారు.
కస్టమర్ బర్గర్‌కు ఆర్డర్ ఇచ్చాడు. ఫుడ్ ర్యాపర్ లోపల ఎలుక వ్యర్ధాలు కనిపించడంతో షాక్ అయ్యాడు. దీంతో కస్టమర్ ఫిర్యాదు ఆధారంగా ఆరోగ్య శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అవుట్‌లెట్ లో తనిఖీలు చేపట్టారు. అక్కడి పరిస్ధితులను చూసి షాక్ అయ్యారు.ఇంత దారుణంగా వాంతి వచ్చేంత గబ్బు పట్టిపోయిన ఉన్న అవుట్ లెట్ ను చూసి షాక్ అయ్యారు. అవుట్‌లెట్‌లో పారిశుద్ధ్య పరిస్ధితులు సజావుగా లేవని గుర్తించారు. ఆహారం తయారు చేసి, భద్రపరిచే ప్రదేశం సహా రెస్టారెంట్ అంతటా ఎలుకలు, ఎలుకల వ్యర్ధాలు ఉన్నట్టుగా గుర్తించారు. అవుట్ లెట్ లోనే కాకుండా స్టాఫ్ రూం, స్టోరేజ్ ఏరియాల్లో కూడా అత్యంత దారుణంగా అపరిశుభ్రత ఉందని గుర్తించారు.
పారిశుద్ధ పరిస్ధితులను ఉల్లంఘించినందుకు మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్‌కు రూ. 4.89 కోట్లకు పైగా కోట్ల జరిమానా చెల్లించాలని,10రోజుల పాటు మూసివేయాలని స్ధానిక కోర్టు ఆదేశించారు. ఈ కేసులో కస్టమర్ సత్వరమే స్పందించి దర్యాప్తు కోసం సకాలంలో కౌన్సిల్‌ను సంప్రదించాలని కౌన్సిలర్ కీన్ లింబజీ పేర్కొన్నారు.