ట్రంప్ కు దూరంగా, సైనికుడి చేయి పట్టుకుని నడిచిన మెలానియా

Melania Trump breaks social distancing : అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో పరాజయం చెందిన ట్రంప్, మెలానియా దంపతుల విడిపోతారా ? అనే హాట్ హాట్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే…ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ దంపతులు దూరం దూరంగా నడిచారు. అమెరికన్ ప్రథమ మహిళ మెలానియా ప్రవర్తించిన తీరు అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
మెలానియా..ఏకంగా ఓ సైనికుడి చేయి పట్టుకుని నడిచిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కనీసం కోవిడ్ నిబంధనలు పాటించకుండా..పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీన అక్కడ వెటరన్స్ డే జరుపుతారు. ఆర్మీలో సేవలందించిన వారిని స్మరించుకొనేందుకు వెటరన్స్ డే నిర్వహించుకుంటుంటారు.
ట్రంప్, మెలానియా ట్రంప్ లు ఆర్లింగ్టన్ జాతీయ శ్మశాన వాటికను సందర్శించారు. సామాజిక దూరం పాటించకుండా..మాస్క్ లు ధరించకుండా పాల్గొన్నారు. ట్రంప్ కాస్త దూరంగా నడిచినా..మెలానియా..మాత్రం ఓ సైనికుడి చేతి పట్టుకుని నడిచారు. ఇదే కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఇవాంక మాత్రం ఫేస్‌మాస్కులతో సామాజిక దూరం పాటిస్తూ కనిపించారు.
ట్రంప్ కు మెలానియా విడాకులు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరిలో ట్రంప్ అధ్యక్ష పీఠం దిగగానే..వీరి వివాహ బంధానికి శుభం కార్డు పడుతుందని అంటున్నారు. ఇదే నిజం అయితే..మొదటి ఇద్దరి భార్యలకు ఇచ్చిన దానికంటే..మెలానియాకు ట్రాంప్ భారీ మొత్తం భరణం ఇవ్వాల్సి ఉంటుందని టాక్.