Met Gala 2021 Kim Kardashian (1)
Met Gala 2021: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మెట్ గాలా అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో హాలీవుడ్ తారలు కళ్లు చెదిరే డ్రెస్సులతో అలరిస్తున్నారు. వైరటీ డెకరేషన్ తో కళ్లు తిప్పుకోనివ్వని సోయగాలతో ఆకట్టుకుంటున్నారు.
Read more : MET Gala 2021: జిమ్నాస్టిక్ స్టార్ సిమోన్ 40కిలోల డ్రెస్ కోసం 100 మంది 6,650 గంటలు పనిచేశారట!
ఈ మెట్ గాలో ఈవెంట్ లో ప్రఖ్యాత హాలీవుడ్ నటి కిమ్ కర్దషియన్ 2021 మెట్ గాలాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రెడ్ కార్పెట్ మీద బాలెన్సియాగా క్రియేటివ్ డైరెక్టర్ డెమ్నా గ్వసాలియా రూపొందించిన ఆల్-బ్లాక్ దుస్తుల్లో మెట్ గాలా వేడుకల్లో సందడి సందడి చేసింది. కాకిని తలపించే నల్లటి దుస్తులతో అందరిని తనవైపు తిప్పుకుంది కిమ్ కర్థషియన్.
ఆమె కారుమబ్బులాంటి నల్లడి గౌనుతో ఠీవీగా నడుస్తుంటే కళ్లు ఆర్పటం కూడా మర్చిపోయి చూస్తుండిపోయారు అందరూ. ఇక ఫోటో గ్రాఫర్ల లెన్స్ కు పనే పనే. క్లిక్ క్లిక్ మనిపిస్తు పలు యాంగిల్స్ లో ఫోటోలు తీయటంలో బిజీ బిజీ అయిపోయారు.రెడ్ కార్పెట్ మీద పూర్తి నల్ల దుస్తులతో కిమ్ కర్దషియన్ స్టైలిష్ వాకింగ్ ఎంతగానో ఆకట్టుకుంది.
Read more : MET Gala 2021 : మెట్ గాలాలో తళుక్కుమన్న సుధారెడ్డి..ఈమె ధరించిన గౌన్ వెరీ స్పెషల్
ఆమె నడక..ఆమె డ్రెస్ వెరీ వెరీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. కేవలం డ్రెస్సే కాదు ముఖం కూడా కనిపించకుండా నల్లటి ముసుగుతో టాప్ టూ బాటమ్ నల్లటి నలుపే కదలాడుతున్నట్లుగా ఆమె నడక ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి.