MET Gala 2021: జిమ్నాస్టిక్ స్టార్ సిమోన్ 40కిలోల డ్రెస్ కోసం 100 మంది 6,650 గంటలు పనిచేశారట!

యూఎస్ జిమ్నాస్టిక్ స్టార్ సిమోన్ బైల్స్ (Simone Biles) ఒలింపిక్ స్టేజ్‌లో ఐకాన్ న్యూయార్క్‌లో జరిగిన METగాలా 2021 ఈవెంట్లో తన గ్లామర్‌తో అదరగొట్టింది.

MET Gala 2021: జిమ్నాస్టిక్ స్టార్ సిమోన్ 40కిలోల డ్రెస్ కోసం 100 మంది 6,650 గంటలు పనిచేశారట!

Met Gala 2021 Simone Biles Wears 40kg Dress, Took 100 People To Make In 6,650 Hours

MET Gala 2021: : యూఎస్ జిమ్నాస్టిక్ స్టార్ సిమోన్ బైల్స్ (Simone Biles).. ఒలింపిక్ స్టేజ్‌లో ఐకాన్ న్యూయార్క్‌లో జరిగిన METగాలా 2021 ఈవెంట్లో తన గ్లామర్‌తో అదరగొట్టింది. MET గాలాలో రెడ్ కార్పెట్ మీద సిమోన్ Beckett Fogg, Piotrek Panszczyk రూపొందించిన 40 కిలోల బరువైన డ్రెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.

త్రీ-ఇన్-వన్ దుస్తుల్లో Swarovski స్ఫటికాలతో అలంకరించిన ఈ డ్రెస్ సుమారు 40 కిలోల బరువు ఉంటుంది. వెనుకభాగంలో మెరిసే నల్లని క్యాట్‌సూట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ డ్రెస్ తయారీ కోసం 100 మంది 6, 650 గంటలు పాటు శ్రమించి డిజైన్ చేశారట..
PM Modi : క్వాడ్ భేటీ, హాజరు కానున్న మోదీ

సూపర్ స్టార్ జిమ్నాస్ట్, సిమోన్‌కు ఇది తొలి ప్రదర్శన. మొదటిసారిగా అమెరికాలో ఎ లెక్సికాన్ ఆఫ్ ఫ్యాషన్ ఈవెంట్‌కు హాజరయింది. అథ్లెటా బ్రాండ్ భాగస్వామిగా సిమోన్ ఈ ఈవెంటుకు అతిథిగా హాజరయింది. Panszczyk ప్రకారం.. సిమోన్ ధరించి త్రి ఇన్ వన్ వస్త్రాలను అందంగా తయారు చేసేందుకు 100 మందికి పైగా 6,650 గంటలు పనిచేశారని పేర్కొంది. ఈ డిజైన్ పూర్తి రూపం అందంగా తీర్చదిద్దడానికి చాలా సమయం పట్టింది.


ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు పూర్తి డిజైన్ అయింది. అలాగే స్కర్ట్ కూడా చాలా బరువుగా ఉంది. ఈ త్రి-ఇన్-వన్ డ్రెస్‌ను మొత్తం క్రిస్టల్‌తో అలకరించారు. గత నెలలో, ఆరుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన బైల్స్ ఫైనల్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు USA జిమ్నాస్టిక్స్ ధృవీకరించింది.

South Korea : టెక్ దిగ్గజానికి భారీ షాక్, రూ. 176 మిలియన్ డాలర్ల జరిమానా..ఎందుకు ?