Viral News : చంటిబిడ్డను ఎత్తుకుని..టీవీ లైవ్‌లో రిపోర్టింగ్
చంటిబిడ్డను ఎత్తుకుని టీవీ లైవ్‌లో రిపోర్టింగ్ ఇచ్చారు మహిళా వాతావరాణ శాస్త్రవేత్త. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- nagamani
- Updated on- February 5, 2022 / 04:51 PM IST
Meteorologist Hold Baby During Broadcast Of Channel Live
meteorologist hold baby during broadcast of channel live: అమ్మ ప్రేమ గురించి చెప్పటానికి ఏ భాషలోని అక్షరాలు సరిపోవు. అమ్మలు ఇంటిని చక్కదిద్దటమే కాదు అటు ఉద్యోగాల్లోను చక్కగా రాణిస్తున్నారు. ఓ పక్క బిడ్డల ఆలనా పాలనాచూసుకుంటు..ఇంటి బాధ్యతలు నెరవేర్చుకుంటూ..ఉద్యోగాలుచేస్తున్నారు. చంటి బిడ్డల్ని సాకుతునే ఉద్యోగ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దేశానికి రాజు అయినా అమ్మకు బిడ్డే అన్నట్లుగా ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా..తల్లి తల్లే.తన బిడ్డ ఏడిస్తే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఆమెలో అమ్మతనం అల్లాడిపోతుంది. మాతృత్వం పొంగిపోతుంది. దేశానికి ప్రధాని అయినా..కార్పొరేట్ కంపెనీలో ఏ స్థాయిలో ఉద్యోగం చేసినా అమ్మ అమ్మే..
Also read : జోలాలీ: పార్లమెంటులో ఎంపీ బిడ్డకు పాలుపట్టిన స్పీకర్
అలా అమ్మలుగా బిడ్డలకు ఏలోటు రాకుండా దేశ ప్రధానులుగా కూడా రాణిస్తున్నారు. అలా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా టీవీ లైవ్ లో మాట్లాడుతుండా ‘మమ్మీ’అంటూ వచ్చిన మూడేళ్ల ముద్దుల కూతురిని ఎలా బుజ్జగించారో తెలిసిందే. ఈ అపురూప అరదైన ఘటన ప్రపంచమంతా వైరల్ అయ్యింది. అటువంటిదే మరో వార్త ఇది..టీవీ లైవ్ లో చంటిబిడ్డను చంకనెత్తుకుని మరీ వాతావరణ రిపోర్టు ఇచ్చారో మహిళా శాస్త్రవేత్త.
యూఎస్‌లోని మిల్వాకీ, విస్కాన్సిన్కు చెందిన రెబెక్కా షుల్డ్ ఓ వాతావరణ శాస్త్రవేత్త. ఆమె ఓ న్యూస్ ఛానెల్‌కు వెదర్ రిపోర్ట్ అందిస్తుంటారామె. కోవిడ్ వల్ల ఆమె ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అలా ఓ టీవీ ఛానెల్లో వెదర్ రిపోర్ట్ అందించాల్సిన సమయంలో తన 13 వారాల పాప ఫియోనా సడన్‌గా నిద్ర లేచింది.దాంతో ఆమె పాపను ఎత్తుకుని లైవ్‌లో వాతావరణ వివరాలు అందించారు.
దీనిపై ఆమె వివరణ ఇస్తూ..కొన్ని నిమిషాల్లో లైవ్‌లోకి రావాల్సి ఉండగా..నా బిడ్డ లేచింది..అందుకే తనతో రిపోర్ట్ చెప్పడానికి వచ్చానని అన్యదా భావించవద్దని వివరించారు. ఈ అరుదైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడా న్యూస్ వీడియో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.నెటిజన్లు “వాట్ ఏ స్వీట్ హార్ట్” అని, “తన తల్లి ఇలా చేస్తే తన కూతురు ఇష్టపడుతుంది.” అని కామెంట్లు పెడుతున్నారు.
