PM Jacinda livestrm : లైవ్ లో మాట్లాడుతున్నన్యూజిలాండ్ ప్రధాని జెసిండా..‘మమ్మీ’అంటూ వచ్చిన కూతురు..ఇంట్రెస్టింగ్ సీన్

న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్ లైవ్ లో ప్రసంగిస్తుంగా ఆమె కూతురు లైవ్ లోకి ‘మమ్మీ’అంటూ వచ్చేసింది. ఆ తరువాత ఏమైందంటే..

PM Jacinda livestrm : లైవ్ లో మాట్లాడుతున్నన్యూజిలాండ్ ప్రధాని జెసిండా..‘మమ్మీ’అంటూ వచ్చిన కూతురు..ఇంట్రెస్టింగ్ సీన్

Daughter Interrupts New Zealand Pm Jacinda Livestream (1)

Daughter interrupts New Zealand PM Jacinda livestream : న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్ లైవ్ లో ప్రసంగిస్తున్నారు. ఇటీవల దేశంలో మరోసారి కరోనా కేసులు నమోదు కావటంతో ప్రధాని జెసిండా మరోసారి కరోనా పరిస్థితిపై ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా జాతిని ఉద్ధేశించి ప్రసంగిస్తుండగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ప్రధాని జెసిండాకు మూడేళ్ల కూతురు ఉంది. జెసిండా జాతిని ఉద్ధేశించి ప్రశసంగిస్తుండగా ఆమె మూడేళ్ల కూతురు అమ్మ లైవ్ లో ఉందని తెలియిన ఆ చిన్నారు ‘మమ్మీ’ అంటూ లైవ్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. దీంతో ప్రధాని ఏమాత్రం తత్తరపడలేదు. చక్కటి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తు..తన చిన్నారి కూతురు చిన్నబుచ్చుకోకుండా ఓ అమ్మలా మారిపోయారు ప్రధాని జెసిండా..లైవ్ ‘డాలింగ్… ఇంకా పడుకోలేదా? ఇది పడుకునే టైమ్ వెళ్లి పడుకో..ఒక నిమిషంలో వచ్చేస్తా’ అంటూ కూతురుతో మాట్లాడారు. ఆ తరువాత నవ్వుతూ ‘దయచేసిన అందరూ నన్ను క్షమించాలి’ అంటే అమ్మ కాస్తా ప్రధానిగా మారిపోయి క్షమాపణ అడిగారు.

Read more : PM Jecinda Shock : ప్రధాని ప్రెస్‌మీట్‌లో రొమాన్స్ ప్రశ్న..షాకింగ్ రియాక్షన్ వైరల్

ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రధాని తన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తూ ‘అందరూ క్షమించాలని నవ్వుతూ అడిగారు. తన కూతురుకి నిద్రాభంగం అయినట్టుందని చెప్పారు. మీ పిల్లలెవరైనా నిద్రలో ఇలాగే లేస్తున్నారా? అని ప్రశ్నించారు. అయితే, తన కూతురుని చూసుకోవడానికి తన తల్లి ఉన్నారని చెబుతు..’ హా..మనం ఎక్కడదాకా వచ్చాం?’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తల్లీకూతుళ్లకు చెందిన ఈ అద్భుతమైన సన్నివేశాన్ని చూసినవారు ఇది అనుకోకుండా జరిగినా చక్కటి అనుభూతి అంటున్నారు.

జెసిండా ఓ దేశ ప్రధానిగాను..ఓ బిడ్డకు తల్లిగాను బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించటమే కాకుండా లైవ్ లో అనుకుండా జరిగిన ‘స్వీట్ డిస్ట్రబెన్స్’ను కూడా చాకచక్యంగాను లౌక్యంగాను మానేజ్ చేశారని ప్రశంసిస్తున్నారు. కూతురు కోసం తన ప్రసంగాన్నే ఆపేయడం..కూతుర్ని బుజ్జగించి పంపించి ఓ అమ్మగాను..తన ప్రసంగాన్ని కొనసాగిస్తునే ప్రజల్ని వారి బిడ్డల గురించి అడుగుత తన సమయస్ఫూర్తిని మరోసారి చాటుకున్నారని ప్రశంసిస్తున్నారు.

కాగా..41 ఏళ్ల జసిండా రెండో సారి న్యూజిలాండ్ ప్రధానిగా బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జెసిండా ప్రధానిగా ఉండగానే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక్కడ మరో విషయం చెప్పాలి. ఓ సారి జెసిండా ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండగా..రిపోర్టర్ రొమాన్స్ గురించి ప్రశ్నంచగా ఆ సమయంలో కూడా జెసిండా సమయస్పూర్తిగా బదులిచ్చారు. ఆ సమయంలో ఆమె రియాక్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Read more : నేను గంజాయి తాగా.. న్యూజిలాండ్ ప్రధాని జసిందా సంచలన వ్యాఖ్యలు

కాగా..న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. తన దేశంలో కరోనాను కట్టడి చేసిన దేశాధినేతగా పేరొందారు మహిళా ప్రధాని జెసిండా. కరోనాతో ప్రపంచం అంతా అల్లకల్లోలంగా మారిన క్రమంలో న్యూజిలాండ్ లో మాత్రం కరోనా అత్యంత సమర్థవంతంగా కట్టడి చేయటంతో ప్రధాని జెసిండా కృషిని ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. కరోనా గురించి అధికారులు ఎంత అప్రమత్తంగా ఉండాలో..ఎటువంటి చర్యలు తీసుకోవాలో..ప్రజలకు మహమ్మారి గురించి అవగాహ కల్పిస్తు నిత్యం లైవ్ ద్వారా దిశానిర్దేశం చేసేవారు ప్రధాని జెసిండా అర్డెర్న్. అలా కరోనాను బాగానే కట్టడి చేశారు.

అయినా అడపా దడపా న్యూజిలాండ్ లో కరోనా కేసులు తలెత్తినప్పుడల్లా వాటిని సమర్థవంతంగా నియంత్నించే చర్యల్ని కొనసాగించేవారు. ఈ క్రమంలో మరోసారి కరోనా కేసులు తలెత్తుండగా మారోసారి ప్రధాని జాతిని ఉద్ధేశించి ప్రసంగిస్తుండా మూడేళ్ల కూతురు రావటంతో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈ సన్నివేశంతో సంతూర్ సబ్బు యాడ్ గుర్తుకొస్తోందంటున్నారు మరికొంతమంది.