Metro Accident: మెక్సికో సిటీలో ఘోర ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న రెండు మెట్రో రైళ్లు..

మెక్సికో సిటీ మెట్రో రైలు ప్రమాదంపై అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ విచారణం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారని తెలిపారు. మృతుల బంధువులకు ఆయన సానుభూతి తెలిపారు.

Metro Accident

Metro Accident: మెక్సికో సిటీలో ఘొర ప్రమాదం చోటు చేసుకుంది. పోట్రెరో, లా రజా స్టేషన్ల మధ్య  మెట్రో లైన్ 3లో  రెండు మెట్రో రైళ్లు ఒకదానికొకటి ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో ఒక్కరు మరణించగా, 57 మంది గాయపడ్డారు. డ్రైవర్ తో సహా గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఏడు ఆస్పత్రులకు తరలించారు. అయితే వీరిలో 22 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది.

 

Metro Accident in Mexico City

రైళ్లు సర్వీసును ప్రారంభిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని నగర మేయర్ క్లాడియా షీన్‌బామ్ ట్విటర్ లో తెలిపారు. సిటీ సెక్యూరిటీ హెడ్ ఒమర్ గార్సియా మాట్లాడుతూ.. లైన్ 3లో ఒక వ్యాగన్ పై చిక్కుకున్న మరో నలుగురిని రక్షించామని అన్నారు. వారు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. మెక్సికో సిటీ సబ్‌వే వ్యవస్థలో 141 మైళ్ల ట్రాక్ ఉంది. 195 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ప్రతీరోజూ సగటున 4.6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.

 

Metro Accident In mexico city

మరోవైపు మెక్సికో సిటీ మెట్రో రైలు ప్రమాదంపై అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ విచారణం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారని తెలిపారు. మృతుల బంధువులకు ఆయన సానుభూతి తెలిపారు. ఇటీవలి కాలంలో మెట్రోలో పలు రకాల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ దేశంలో 2021లో జరిగిన రైలు ప్రమాదంలో 21 మంది మరణించారు. 60మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు.