Covid in china : ఐరన్ బాక్సుల్లో గ‌ర్భిణులు,చిన్నారుల నిర్భంధం..వృద్ధులను కూడా వదలని చైనా Viral video

కోవిడ్ సోకినవారిని ఐరన్ బాక్సుల్లో నిర్భంధిస్తోంది చైనా. గ‌ర్భిణులు,చిన్నారులు, వృద్ధులను కూడా వదలకుండ ఐరన్ బాక్సుల్లో నిర్భంధిస్తోంది. ఒక్క కేసు నమోదు అయినా నగరం అంతా లాక్ డౌన్.

Covid in china metal boxes quarantine camps : ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారితో వణికిపోతోంది అంటే దానికి మూల కారణం చైనా అనే ఆరోపణలకు మూటకట్టుకున్న చైనాకూడా దానితో నేటి పోరాడుతునే ఉంది. కానీ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి చేయ‌డం కోసం చైనా అత్యంత కఠినమైన ఆంక్ష విధించింది మొదట్లో. అదే నిర్భంధాలు, అత్యంత కఠనమైన ఆంక్షల్ని ఇప్పుడు కూడా విధిస్తోంది. ఈ ఆంక్షల్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నా డ్రాగన్ దేశం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ప్రజల్ని జంతువుల్లా నిర్భంధిస్తోంది. ఇదంతా కరోనాను కట్టడి చేయటానికే అంటోంది. ఈ నిర్భంధాల్లో ఒక్క కేసు వ‌చ్చినా.. ఆ ప‌ట్ట‌ణం మొత్తం లాక్‌డౌన్ విధిస్తోంది.

Also read : Dr Simon Bramhall : రోగులకు కాలేయ మార్పిడి చేసి..ఆ కాలేయాలపై తన పేరు రాసుకున్న డాక్టర్

అంతేకాదు ప్రజల్ని పందుల్ని నిర్భంధించినట్లుగా కరోనా సోకిన రోగుల్ని ఇనుప బాక్సుల్లో నిర్భంధిస్తోంది. చిన్నపిల్లలని కూడా చూడటంలేదు. ఆఖరికి గర్భిణులను కూడా ఈ ఇనుప బాక్సుల్లో నిర్భంధిస్తోంది. దీని కోసం చైనా ప్రత్యేకించి ఐరన్ బాక్సులను తయారు చేయించింది. కంటైనర్లలా కనిపించే ఈ ఐరన్ బాక్సులు వరుసగా కనిపిస్తున్నాయి. ఈ బాక్సుల్ని..ఈ నిర్భంధాలను చూస్తుంటే ఇది చైనా కర్కశత్వమా? కరోనాను కట్టడి చేయటానికి ఏదేశం చేయనంతగా ఆంక్షలా? అని అనిపిస్తోంది.

కాగా ఒలింపిక్స్ క్రీడలను చైనాలో జరుగనున్నాయి. దీంతో వచ్చే నెలలో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ కల్లా దేశంలో కేసులు లేకుండా చేయటానికి చైనా ఇటువంటి అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తు ప్రజల్ని జంతువులను నిర్భంధించినట్లుగా ఐరన్ బాక్సుల్లో నిర్భంధిస్తోంది. ఒలింపిక్స్ కల్లా దేశంలో జీరో కేసులే లక్ష్యంగా ఒక్కొక్క ప్రాంతాన్ని నిర్భందించుకుంటూ పోతోంది ప్రభుత్వం. దీని కోసం ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఎంత వ్యతిరేకత వచ్చినా ఏమాత్రం ఖాతరు చేయటంలేదు చైనా. ఒక్క కేసు వ‌చ్చినా.. ఆ ప‌ట్ట‌ణం మొత్తం లాక్‌డౌన్ విధిస్తోంది. ప్రభుత్వం విధించే ఆంక్షల్ని పాటించి తీరాల్సిందేనని హుకుం జారీ చేస్తోంది.

Also read : Kartarpur : దేశ విభజనతో దూరమయ్యారు.. 74 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు

ఇక క‌రోనా రోగుల్ని ఇనుప డ‌బ్బాల్లో నిర్భంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆ వీడియోల్లో కరోనా సోకిన వారిని తీసుకువెళ్లేందుకు బస్సుల వరుసలు, మరోవైపు ప్రజలను నిర్భందించే మెటల్‌ బాక్స్‌ల వరుసలు కనిపిస్తున్నాయి. మెట‌ల్ బాక్సుల్లో ప్రెగ్నెంట్ మ‌హిళ‌లు, చిన్నారులు, వృద్దుల‌ను బంధిస్తున్నారు.నిర్భంధిస్తున్నారు. ఈ బాక్సుల్లో ఓ ఉడెన్ బెడ్‌తో పాటు టాయిలెట్ ఉంటుంది. దాదాపు రెండు వారాల పాటు వారు ఆ చిన్న పెట్టెల్లో కరోనా బాధితులు ఉండి తీరేలా చైనా నిర్భంధిస్తోంది.

Also read : India Open 2022: ఏడుగురు బ్యాడ్మింటన్ ప్లేయర్స్‌కు క‌రోనా..టోర్నీ నుంచి అవుట్

పైగా అనేక ప్రాంతాల్లో నివాసితులను అర్ధరాత్రి దాటిన తర్వాత తమ ఇళ్లను విడిచి.. నిర్భంధ కేంద్రాలకు వెళ్లాలని ఆదేశించింది. ట్రాక్ అండ్ ట్రేస్ యాప్‌ల‌తో త‌క్ష‌ణ‌మే వారిని క్వారంటైన్ చేస్తున్నారు. చైనా అధికారులు ఇప్ప‌టికే రెండు కోట్ల మందిని ఇళ్లలోనే నిర్భంధించారు. క‌నీసం కూర‌గాయ‌లు..నిత్యావరసర సరుకులు కొనుక్కోవటానికి కూడా బయటకు రానివ్వటంలేదు. బయటకు వస్తే క్వారంటైనే అంటూ భయపెడుతోంది.

ట్రెండింగ్ వార్తలు