Earthquake In Turkey : టర్కీని కుదిపేసిన భారీ భూకంపం

టర్కీలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. పెను భూకంప టర్కీని కుదిపేసింది. తెల్లవారుజాము 4:17 గంటలకు భూకంపం సంభవించింది. దీంతో పలు భవనాలు కుప్పకూలాయి. ఈ విలయంలో ఇప్పటికే 200 మందికిపైగా మరణించారు.

Earthquake In Turkey :  టర్కీలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. పెను భూకంప టర్కీని కుదిపేసింది. తెల్లవారుజాము 4:17 గంటలకు భూకంపం సంభవించింది. దీంతో పలు భవనాలు కుప్పకూలాయి. ఈ విలయంలో ఇప్పటికే 200 మందికిపైగా మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయ పడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదు అయింది. శిథిలా కింద అనేకమంది చిక్కుకున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. టర్కీ ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉండగా భూకంపం సంభవించింది. దీంతో నిద్రలో ఉన్నవారు నిద్రలోనే చనిపోయారు.

ఏడు నగరాలపై భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. భూకంపం తీవ్రతకు టర్కీ, సిరియాలో పెనునష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. భారీ భూకంపం తర్వాత ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. టర్కీలో సంభవించిన భూకంపం దాటికి అనేక భవనాలు నేలకూలాయి. టర్కీలోని ఉస్మానియాలో 34 భవనాలు ధ్వంసమయ్యాయి. టర్కీకి ప్రధాన పారిశ్రామిక కేంద్రమైన గజియాన్టెస్, సిరియా సరిహద్దు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.

Earthquake In Turkey: టర్కీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదు.. కూలిన భవనాలు..

సిరియాలోని పశ్చిమ తీర ప్రాంతమైన లటకియాలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం దాటికి టర్కీలోని ప్రాంతాల్లో 200 మందికిపైగా మరణించగా, సిరియాలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భవనాలు కూలి 45 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఇరు దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భవనాల శిథిలా కింద అనేకమంది చిక్కుకొని పోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు.

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని టర్కీ అధ్యక్షుడు రజబ్ తయ్యబ్ ఎర్దుగాన్ ట్వీట్ చేశారు. ఆరు సార్లు భూమి కంపించిందని, దెబ్బతిన్న భవనాల్లోకి ఎవరూ ప్రవేశించవద్దని టర్కీ అధ్యక్షుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉంటే సిరియాలోని అలెప్పో, హమా నగరాల నుండి నష్టం జరిగినట్లు నివేదికలు ఉన్నాయి. సిరియాలో టర్కీ సరిహద్దు ప్రాంతాల్లో చాలా భవనాలు కూలిపోయాయి. సిరియాలోని లెబనాన్ లోనూ 40 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగుపెట్టారు.

ట్రెండింగ్ వార్తలు