20,000 కి.మీ. రేంజ్ ఉన్న అణు క్షిపణిని ప్రదర్శించిన చైనా.. అమెరికా గుండె గుభేల్!
గగన, సముద్ర, భూతలాల నుంచి ప్రయోగించే క్షిపణులను పరేడ్‌లో చూపించారు. మొదటిసారి మూడు వ్యూహాత్మక అణు దళాలను ఒకే చోట చూపించారు. వీటిని ఒకేసారి చూపించడం గమనార్హమని లండన్‌లోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ సీనియర్ ఫెలో మియా నోవెన్స్ అన్నారు. ( China DF 61 )

DF 61 missile
China DF 61: జపాన్‌పై రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచి 80 ఏళ్లు పూర్తయిన వేళ చైనా ఆయుధ ప్రదర్శన చేసింది. బీజింగ్‌లో అధునాతన యుద్ధ విమానాలతో పాటు మిసైళ్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామగ్రిని ప్రదర్శించింది.
ఇందులో అత్యాధునిక భారీ అణు క్షిపణి డీఎఫ్-5సీ కూడా ఉంది. ఈ క్షిపణి రేంజ్ 20,000 వేల కిలోమీటర్లకు పైగానే ఉంటుంది. అంటే భూగోళం మొత్తం ఉంటుంది. (China DF 61)
ప్రపంచంలోని ఏ లక్ష్యాన్నైనా ఇది చేరుకుని, విధ్వంసం సృష్టించగలదు. డీఎఫ్-5సీని మూడు భాగాలుగా తరలిస్తారు. అనంతరం ఆ భాగాలను కలిపి ప్రయోగిస్తారు. శత్రుదేశంలోని భూగర్భ లక్ష్యాలను కూడా ఇది ఛేదిస్తుంది.
అణు సామర్థ్యంతో కూడిన క్షిపణుల్లో డీఎఫ్-61 కూడా కనిపించింది. దీన్ని మొబైల్ ప్లాట్‌ఫాం నుంచి ప్రయోగించవచ్చు. దీని వివరాలను బయటకు రాలేదు. దీన్ని గత మోడల్ పరిధి 12,000 కిలోమీటర్లకుపైగా ఉండేది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ రేంజ్ డీఎఫ్-61కు ఉంది. బహుళ వార్‌హెడ్స్ మోసే సామర్థ్యం దీనికి ఉంటుంది.
Also Read: కొడుకుతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరైన అక్కినేని నాగార్జున
పరేడ్ సమయంలో హెలికాప్టర్లు ఎగురుతూ 80 సంఖ్య ఆకారంలో కనపడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80వ వార్షికోత్సవానికి గౌరవార్థంగా ఈ సంఖ్యను ఇలా ప్రదర్శించారు. కొత్త క్షిపణులు, డ్రోన్లు, ఇతర ఆధునిక పరికరాలు ఆర్సెనల్‌లో చేరాయి.
చైనాలో అణు ఆయుధా నిల్వ ఇప్పటివరకైతే అమెరికా, రష్యా కంటే తక్కువగానే ఉంది. కానీ, వేగంగా పెరుగుతోంది. అమెరికా రక్షణ శాఖ కాంగ్రెసుకు సమర్పించిన వార్షిక నివేదిక ప్రకారం.. చైనా వద్ద ప్రస్తుతం 600కు పైగా వార్‌హెడ్స్ ఉన్నాయి. 2030 నాటికి 1,000కి పైగా ఉంటాయి.
గగన, సముద్ర, భూతలాల నుంచి ప్రయోగించే క్షిపణులను పరేడ్‌లో చూపించారు. మొదటిసారి మూడు వ్యూహాత్మక అణు దళాలను ఒకే చోట చూపించారు. వీటిని ఒకేసారి చూపించడం గమనార్హమని లండన్‌లోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ సీనియర్ ఫెలో మియా నోవెన్స్ అన్నారు.
“భయపెట్టి దాడి జరగకుండా అడ్డుకోవడం” వంటి వ్యూహాలకు సంబంధించినదే ఈ సైనిక ప్రదర్శన అని మియా నోవెన్స్ తెలిపారు. అమెరికా, దాని మిత్రదేశాలు చైనాపై యుద్ధం చేయాలన్న ఆలోచన చేయకుండా ఉండడానికి డ్రాగన్ కంట్రీ సైనిక శక్తిని ప్రదర్శించిందని అన్నారు.
అలాగే, గగన తలం నుంచి ప్రయోగించే జేఎల్-1 దీర్ఘ శ్రేణి క్షిపణి, సముద్రం నుంచి ప్రయోగించే జేఎల్-3 క్షిపణి కూడా కనిపించాయి. ఇవి రెండూ అణు సామర్థ్యంతో ఉన్నాయి.
పరేడ్‌లో ఇతర కొత్త క్షిపణులు కూడా కనిపించాయి. ముఖ్యంగా నౌకలపై దాడి చేసే క్షిపణులు ఉన్నాయి. ఆసియా-పసిఫిక్ రక్షణ వ్యూహంలో ఇవి కీలకం.
పరేడ్‌లో తొలిసారి వైజె-15, వైజె-17, వైజె-19, వైజె-20 యాంటీ-షిప్ క్షిపణులు కనిపించాయి. ఇవన్నీ దీర్ఘ శ్రేణి సామర్థ్యం కలిగిన హైపర్‌సోనిక్ మిసైళ్లు.