Mahsa Amini: ఇస్లాం ఆచారంపై తిరగబడ్డ మహిళలు.. హిజాబ్ కాల్చేస్తూ, జుట్టు కత్తిరించుకుంటూ భారీ ఎత్తున నిరసన

మరోవైపు నిరసన చేస్తున్న మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి. హిజాబ్ తొలగిస్తున్న మహిళలు లక్ష్యంగా అనేక దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ అణచివేతతో పాటు పౌర సమాజంలోని కొంత మంది దాడుల నడుమ ముస్లిం మహిళలు తన ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mahsa Amini: ఇస్లాం దేశాల్లో మహిళలపై ఉండే ఆంక్షల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభివృద్ధిలో దూసుకుపోయే దేశాల్లో కూడా ఇస్లాంలోని ఆచారాల సంప్రదాయల విషయంలో మహిళలపై అనేక ఆంక్షలు ఉంటాయి. ముఖ్యంగా హిజాబ్ విషయంలో అయితే అధికారిక చట్టాలు ఉంటాయి. మహిళలు తప్పనిసరిగా ముఖం, వెంట్రుకలు కూడా కనిపించకుండా హిజాబ్ ధరించాలనే మతాచారానికి అనుకూలంగా ఈ చట్టాలు చేయబడ్డాయి.

అయితే ఇంతటి కఠిన నిబంధనలను చట్టాలను ధిక్కరిస్తూ ఇరాన్‭లోని మహిళలు హాజాబ్‭ను కాల్చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి హిజాబ్ తొలగించి దానికి నిప్పు పెడుతున్నారు. ప్రస్తుతం ఇరాన్ దేశవ్యాప్తంగా ఈ ఆందోళన పెద్ద ఎత్తున కొనసాగుతోంది. దమ్ముంటే ఏం చేస్తారో అదే చేసుకోండంటూ అక్కడి పోలీసులకు ఛాలెంజ్ విసురుతున్నారు. ఇంతటితో ఆగకుండా.. హిజాబ్ కాల్చేస్తూ, జుట్టు కత్తించుకుంటూ ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

Sukhbir Singh Badal: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‭పై మళ్లీ ఊపందుకున్న తాగుబోతు ఆరోపణలు.. టార్గెట్ చేసిన అకాలీ దళ్ చీఫ్

రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వేలాది మహిళలను అణిచివేసేందుకు అక్కడి భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. మహిళలపై లాఠీ చార్జ్ చేస్తున్నారు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, తుపాకులు పేల్చుతూ చెల్లచెదురు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రపంచ వ్యాప్తంగా నెటిజెన్లు మహిళల నిరసనపై ప్రశంసలు కురిపిస్తూనే ఇరాన్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా ఉండే మత నిబంధనలు, ఆచారాలు అక్కర్లేదని తేల్చి చెప్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా మహ్సా అమినీ అనే 22 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి ఇరాన్ రాజధాని టెహ్రన్‭కు వెళ్లింది. అయితే ఆమె హిజాబ్ ధరించలేదనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. సడెన్‭ను ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. పూర్తిగా కోమాలోకి వెళ్లిన అమినీ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై ఇరాన్ మహిళా లోకం భగ్గుమంది. అమినీని పోలీసులు భౌతికంగా హింసించారని, ఆమె ఒంటిపై గాయాలున్నాయని, ఆమెది ముమ్మాటికీ హత్యేనని కుటుంబీకులు సహా మహిళా లోకం తీవ్రంగా ఆరోపిస్తోంది.

Girl Gang-Raped: దళిత యువతిపై సామూహిక అత్యాచారం.. డీజిల్ పోసి దహనం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఈ ఘటన ప్రస్తుతం ఇరాన్ దేశాన్ని కుదిపివేస్తోంది. ఇరాన్‭లో ఏడేళ్లు దాటిన మహిళలంతా హిజాబ్ ధరించాలనే కఠిన మత నిబందన ఉంది. షరియా చట్టం ప్రకారం.. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే, బహిరంగ మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. లేదంటే అరెస్ట్ చేస్తారు. వాస్తవానికి దీనిపై చాలా కాలంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ, దీనిని సవరించడానికి ప్రభుత్వాలు సముఖంగా లేవు.

కాగా, మరోవైపు నిరసన చేస్తున్న మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి. హిజాబ్ తొలగిస్తున్న మహిళలు లక్ష్యంగా అనేక దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ అణచివేతతో పాటు పౌర సమాజంలోని కొంత మంది దాడుల నడుమ ముస్లిం మహిళలు తన ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mayawati: విపక్షాలపై దురహంకార వైఖరి.. బీజేపీపై మండిపడ్డ మాయావతి

ట్రెండింగ్ వార్తలు