విద్యుత్ విమానం
కాలుష్య రహిత, నిశ్శబ్ద విమానయనానికి పునాదులు వేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) అడుగులు వేస్తోంది.

కాలుష్య రహిత, నిశ్శబ్ద విమానయనానికి పునాదులు వేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) అడుగులు వేస్తోంది.
కాలుష్య రహిత, నిశ్శబ్ద విమానయనానికి పునాదులు వేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) అడుగులు వేస్తోంది. పూర్తిగా విద్యుత్ తో నడిచే తన తొలి ప్రయోగాత్మక విమానాన్ని ఆవిష్కరించింది. ఇది వచ్చే ఏడాది గగన ఆకాశంలో విహరించనుంది.
ఎక్స్-57 మ్యాక్స్ వెల్ అనే విమానం 2015 నుంచి అభివృద్ధి దశలో ఉంది. ఇటలీకి చెందిన పి2006టీ అనే లోహవిహంగానికి మార్పులు చేర్పులు చేసి దీన్ని సిద్ధం చేశారు. తుడి మోడల్ లో 14 విద్యుత్ మోటార్లు ఉంటాయి. ప్రస్తుతానికి రెండింటినే అమర్చారు. ప్రత్యేకంగా రూపొందించిన లిథియం అయాన్ బ్యాటరీల నుంచి వీటికి శక్తి అందుతుంది.
ఇప్పటికే పలు ప్రైవేట్ కంపెనీలు విద్యుత్ విమానాలను అభివృద్ధి చేస్తున్నాయి. ఈక్రమంలో ఈ రంగంల కోసం సరైన ప్రమాణాలను సిద్ధం చేయడం నాసా ఉద్దేశం. ఈ విమాన భద్రత, ఇంధన సమర్థత, ధ్వని స్థాయి, గాలిలో విహరించే సామర్థ్యం వంటి వాటికి సంబంధించి పరిజ్ఞానాలను పరీక్షించనుంది.