Nasa
NASA: అంతరిక్షంలోకి రాత్రివేళ తొంగిచూస్తే తారల తళుకులు, చందమామ వెన్నెల వెలుగులు మనల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. అయితే, మనకు ఇప్పటి వరకు తెలిసింది.. ఒక్క చందమామనే ఉంటాడని. కానీ, మన ఖగోళ శాస్త్రవేత్తలు వినీలాకాశంలో ఎన్నో చంద్రుళ్లు ఉన్నారని కనిపెట్టారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఆధారంగా యురేనస్ గ్రహంపై ఉన్న చందమామను నాసా (Nasa) గుర్తించింది. ఇది 29వ చంద్రుడు అని నాసా తెలిపింది. దీనికి ఎస్/2025 యూ1 అని పేరు పెట్టారు.
ఫిబ్రవరి 2వ తేదీన సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ చంద్రుడిని గుర్తించినట్లు నాసా వెల్లడించింది. ఈ చంద్రుడి వ్యాసం కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని అంచనా వేశారు. అలాగే దాదాపు 56,000 కిలోమీటర్ల దూరంలో గ్రహం చుట్టూ తిరుగుతున్నట్లు పరిశోధక బృందం గుర్తించింది.
సౌత్‌వెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సౌర వ్యవస్థ సైన్స్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ విభాగంలోని ప్రధాన శాస్త్రవేత్త మరియమ్ ఎల్ మౌతామిడ్ మాట్లాడుతూ.. ఇది ఒక చిన్న చంద్రుడు. కానీ, ఒక ముఖ్యమైన ఆవిష్కరణ. ఇది దాదాపు 40 సంవత్సరాల క్రితం అంటే 1986లో యూరేనస్‌ను దాటుకొని నాసాకు చెందిన వాయేజర్ – 2 అంతరిక్ష నౌక ప్లైంబై సమయంలో చూడని విషయం అని అన్నారు.
అయితే, ప్రస్తుతం గుర్తించిన ఈ చంద్రుడు యురేనస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడని, గ్రహ కేంద్రం నుండి దాదాపు 35వేల మైళ్లు (56వేల కిలోమీటర్లు) దూరంలో ఈ చంద్రుడు తిరుగుతున్నాడని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇది యురేనస్ ప్రధాన వలయాల వెలుపల ఉన్న ఒఫెలియా, బియాంకా కక్ష్యల మధ్య ఉంది.
గతంలో తెలిసిన 28 ఉపగ్రహాల్లో మొత్తం 13ని ప్రదర్శిచాయి. ఖగోళ శాస్త్రవేత్తలు యురేనియన్ వ్యవస్థలో ఇతర చిన్న చందమామలను గుర్తించినప్పటికీ కొన్ని 12 నుంచి 16కిలో మీటర్ల వ్యాసం కలిగినవి.