Pak PM Shehbaz Sharif
Pakistan National Assembly : మిత్రపక్షాల సంప్రదింపులతోనే ఆగస్టు 12లోపు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పునరుద్ఘాటించారు. జాతీయ అసెంబ్లీ పదవీకాలం ఆగస్టు 12వతేదీతో ముగుస్తుందని, అంతకు ముందే అసెంబ్లీని రద్దు చేస్తామని షెహబాజ్ చెప్పారు. (Pakistan PM) ఎన్నికల సంఘం తదుపరి ఎన్నికల తేదీని ప్రకటిస్తుందని ఆయన తెలిపారు.
Rain today updates : పలు రాష్ట్రాల్లో నేడు భారీవర్షాలు..ఐఎండీ హెచ్చరికలు జారీ
నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతతో సంప్రదింపులు జరిపి ఆపద్ధర్మ ప్రధాని గురించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. (National Assembly Will Be Dissolved) మే 9 హింసాకాండలో పిటిఐ కార్యకర్తలతో పాటు, రాజకీయ నాయకుల బృందం, కొంతమంది సైనికులు, వారి కుటుంబాలు కూడా పాల్గొన్నాయని షెహబాజ్ షరీఫ్ చెప్పారు.