Navratri in Pakistan
Viral Video: భారత్‌లో నవరాత్రి వేడుకలను ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. పాకిస్థాన్‌లోనూ ఈ వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. అక్కడి హిందువులు జరుపుకున్న ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గార్భా, దాండియా నృత్యాలను ఎంతో ఉత్సాహంగా చేశారు.
పాకిస్థాన్‌కు చెందిన హిందూ వ్యక్తి ప్రీతమ్ దేవ్రియా ఇందుకు సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి హిందువులు ఈ ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకున్న దృశ్యాలను ఇందులో చూడవచ్చు.
Also Read: పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న సీపీఐ నారాయణ.. ఎందుకంటే?
పాకిస్థాన్‌లో శాకాహారులు, జైనులు కూడా ఉంటారా? అని ఓ యూజర్ అడగగా ప్రీతమ్ దేవ్రియా ఉన్నారని తెలిపారు. మరో వీడియోను కరాచీకి చెందిన ధీరజ్ అనే హిందూ పంచుకున్నారు. “హ్యాపీ నవరాత్రి ఫ్రం ఇండియా” అంటూ నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఏడాది నవరాత్రి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతోంది. హిందూ మాసం ఆశ్వయుజ శుక్ల పక్షంలోని తొమ్మిది రాత్రులలో ప్రతిరోజు దుర్గమ్మ ఒక్కో ప్రత్యేక రూపంలో దర్శనమిస్తారు. ఈ తొమ్మిది రోజుల పండుగ విజయదశమితో ముగుస్తుంది. నవరాత్రి సందర్భంగా నవదుర్గలను ఆరాధిస్తారు. గార్భా గుజరాత్ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్యం. దాండియా అంటే కర్రలతో చేసే సంప్రదాయ నృత్యం.