పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న సీపీఐ నారాయణ.. ఎందుకంటే?

పార్టీలో అంతర్గత సమస్యల పరిష్కారం కోసం ఇకపై పని చేయాల్సి ఉంటుందని నారాయణ తెలిపారు.

పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న సీపీఐ నారాయణ.. ఎందుకంటే?

CPI Narayana

Updated On : September 27, 2025 / 2:51 PM IST

CPI Narayana: పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సీపీఐ నారాయణ ప్రకటించారు. 75 ఏళ్ల వయస్సు నిండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇకపై సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా నారాయణ వ్యవహరించనున్నారు. ఆయన ఇంతకుముందు జాతీయ కార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. చండీగఢ్‌లో జరిగిన సీపీఐ 25వ మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. 75 ఏళ్లు నిండిన వాళ్లను రిలీవ్ కావాలని నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. నాయకత్వ స్థాయి నుంచి పదవీ విరమణ చేశానని అన్నారు.

Also Read:   రెడ్ అలర్ట్‌ జారీ.. తెలంగాణలోని ఈ జిల్లాల వారు జరజాగ్రత్త

పార్టీలో అంతర్గత సమస్యల పరిష్కారం కోసం ఇకపై పని చేయాల్సి ఉంటుందని నారాయణ తెలిపారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రం డి.రాజా పదవీకాలాన్ని పొడిగిస్తూ జాతీయ మహాసభల్లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

పార్టీలో అంతర్గత సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటిని సక్రమంగా పరిష్కరించే ప్రక్రియ కోసం కంట్రోల్ కమిషన్ ఉందని నారాయణ అన్నారు. పార్టీ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పారు.