Telangana Rain forecast: రెడ్ అలర్ట్ జారీ.. తెలంగాణలోని ఈ జిల్లాల వారు జరజాగ్రత్త
హైదరాబాద్ సహా తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Heavy Rains
Telangana Rain forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
నేడు వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే.. నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తున్నట్లు చెప్పారు.
Also Read: MiG-21: ‘మిగ్-21’ శకం ముగిసింది.. వీడ్కోలు పలికిన వాయుసేన.. రాజ్‌నాథ్ సింగ్ ఏమన్నారంటే..
అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వనపర్తి, నారాయణ్ పేట్, జోగులాంబ గద్వాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ సహా తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రేపు కూడా 17 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.