COVID-19 Vaccines England : ప్రాణాలను రక్షిస్తోన్న టీకాలు.. ఇంగ్లాండ్‌లో 12వేల మరణాల నిర్మూలన

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు సత్ఫలితాలు ఇస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌లో టీకాల వల్ల ఇప్పటివరకు 12వేల మరణాలను నిర్మూలించాయి.

12,000 lives saved by vaccines : ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు సత్ఫలితాలు ఇస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌లో టీకాల వల్ల ఇప్పటివరకు 12వేల మరణాలను నిర్మూలించాయి. ఈ మేరకు అక్కడి ప్రజారోగ్య విభాగం ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా మరో 30వేలకుపైగా వృద్ధులు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి బారినపడకుండా వ్యాక్సిన్‌లు అడ్డుకున్నాయని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌-PHE వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని బ్రిటన్‌ అత్యంత వేగంగా చేపడుతోంది.

ఇప్పటికే అక్కడ ఐదున్నర కోట్ల డోసులను అందించగా మొత్తం జనాభాలో దాదాపు 53శాతం తొలి డోసు తీసుకున్నారు. 28శాతం రెండు డోసులను పొందారు. దీంతో వ్యాక్సిన్ల
ఫలితాలను విశ్లేషించిన PHE.. ఏప్రిల్‌ చివరి నాటికి 60ఏళ్లకు పైబడిన వారిలో 11 వేల 700 మరణాలను నిర్మూలించగలిగినట్లు వెల్లడించింది. అంతేకాకుండా 65ఏళ్లు పైబడిన
మరో 33వేల మందిని ఆసుపత్రి చేరికల నుంచి నివారించామని తెలిపింది. వ్యాక్సినేషన్‌తో వైరస్‌ వ్యాప్తిని నిర్మూలించడం వల్ల మరణాలు, ఆసుపత్రి చేరికలను భారీ స్థాయిలో
నిరోధిస్తున్నామనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఇంగ్లాండ్‌ ప్రజారోగ్య విభాగం స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు