Needle Free Injection: సూదిలేని ఇంజెక్షన్‌..నొప్పి తెలీకుండా చేసేయొచ్చు

సూదిలేని ఇంజెక్షన్‌ వచ్చేసింది...నొప్పి లేకుండా ఇంజెక్షన చేసేయొచ్చు అంటున్నారు నిపుణులు.

Needle Free Injection: ఇంజెక్షన్‌..చిన్నసూది చురుక్కున దిగే ఇంజెక్షన్ అంటే చిన్న పిల్లలే కాదు చాలామంది పెద్దవాళ్లే భయపడిపోతారు. ఇంజెక్షన్ చేస్తానని డాక్టర్ అంటే చాలు ఆమడదూరం పారిపోయేవారున్నారు. ప్లీజ్ డాక్టర్ ఇంజెక్షన్‌ వద్దు..ట్యాబ్లెట్స్, సిరప్పులు రాయండీ అని దీనంగా అడుగుతాం. కానీ ఇక ఆ భయమే అవసరంలేదు. ఎందుకంటే ఇక నుంచి సూది లేని ఇంజెక్షన్ వచ్చేసిందంటున్నారు నిపుణులు.

Read more :Andhrapradesh : బాబు వస్తున్నాడు ! ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాల కోసం రూట్ మ్యాప్ ఖరారు

సూదిలేని ఇంజెక్షన్‌ వచ్చేసింది. దాని పేరు ‘కొబి’. ఇది ఒక రోబో. కొబి అనేది రోబోటిక్స్ ఫ్లాట్ ఫారమ్. కెనడాకు చెందిన ఓ యూనివర్సిటీవారు దీన్ని రూపొందించారు. ఈ రోబో.. మూడు సెంటీమీటర్ల దూరం నుంచి అధిక ఒత్తిడితో మీ శరీరంలోకి మందును పంపిస్తుంది. ఇది కూడా మీ శరీరానికి రంధ్రం చేస్తుంది. కానీ, అది వెంట్రుక మందం ఎంత ఉంటుందో అంత మాత్రమే. కంటికి కనిపించదు. నొప్పి కూడా అస్సలు తెలియదు. ఇందులోని ఎల్‌ఐడీఏఆర్‌ సెన్సర్లు.. ఎక్కడ ఇంజెక్షన్‌ ఇవ్వాలో మ్యాప్‌ చేయడానికి, శరీరంలోని ఇతర ఇన్‌ఫెక్షన్లను గుర్తించడానికి ఉపయోగపడతాయి.

Read more :AP Three Capitals : ఇప్పటికీ 3 రాజధానులకే కట్టుబడి ఉన్నా : మంత్రి పెద్దిరెడ్డి

ముందున్న డిస్‌ప్లే స్క్రీన్‌పై ఇదంతా చూడొచ్చు. పైగా ఒకరికి వేసిన ఇంజెక్షన్‌ ఇంకొకరి వేస్తే..వచ్చే జబ్బుల నుంచి కూడా ఇది కాపాడుతుందట. ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్న ఈ రోబో త్వరలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావటానికి కాస్త సమయం పడుతుంది.ఇదే గనుక అందుబాటులోకి వస్తే ఇక ఇంజెక్షన్ చేయించుకోవటానికి ఏమాత్రం భయపడనక్కరలేదు. అస్సలు నొప్పే తెలియని ఈ వింత పద్ధతి చిన్నపిల్లలు సైతం ఇంజెక్షన్‌ వేయించుకోడానికి భయపడకుండా చేస్తుందంటున్నారు పరిశోధకులు.

ట్రెండింగ్ వార్తలు