AP Three Capitals : ఇప్పటికీ 3 రాజధానులకే కట్టుబడి ఉన్నా : మంత్రి పెద్దిరెడ్డి

మూడు రాజధానుల ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనన్నారు. శుభం కార్డుకు మరింత సమయం ఉందని చెప్పారు.

AP Three Capitals : ఇప్పటికీ 3 రాజధానులకే కట్టుబడి ఉన్నా : మంత్రి పెద్దిరెడ్డి

Ap Three Capitals

Updated On : November 22, 2021 / 2:04 PM IST

AP Three Capitals : మూడు రాజధానుల ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనన్నారు. శుభం కార్డుకు మరింత సమయం ఉందని చెప్పారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇప్పటికీ తాను మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర లక్షలమందితో సాగుతోందా? అమరావతి రైతుల పాదయాత్ర.. పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర – రైతుల పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలి : రాజధాని రైతులు
మూడు రాజధానుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో మహాపాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమరావతి ఐకాస ప్రకటించింది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికైనా వెనక్కి తీసుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేసింది. ఇన్నాళ్లూ అమరావతినే విమర్శించిన వాళ్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read Also : Andhra Pradesh : మూడు రాజధానుల రద్దుకు ఏపీ సర్కారు నిర్ణయం