Andhra Pradesh : మూడు రాజధానుల రద్దుకు ఏపీ సర్కారు నిర్ణయం

అమరావతిపై ఏపీ కేబినెట్ లో చర్చించామన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో వివరిస్తామని మంత్రి నాని చెప్పారు. కొందరు కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారని కొడాలి నాని విమర్శించారు

Andhra Pradesh :  మూడు రాజధానుల రద్దుకు ఏపీ సర్కారు నిర్ణయం

Cm Jagan Three Capitals

మూడు రాజధానులపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బిల్లు ఉపసంహరణకు సంబంధించి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపినట్టు తెలుస్తోంది. మూడు రాజధానులపై హైకోర్టులో విచారించిన అనంతరం బిల్లును వెనక్కు తీసుకుంటున్నగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు. మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని త్రిసభ్య ధర్మాసనానికి ఏజీ వెల్లడించారు. దీనిపై అసెంబ్లీలో అధికారికంగా సీఎం జగన్ ప్రకటించనున్నారు.

Read Also : AP Capital : రాజధాని..కీలక పరిణామం, ఎప్పుడేం జరిగింది ?

అసెంబ్లీలో సీఎం జగన్ చేసే ప్రకటనపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. రాజధానిపై కొత్త బిల్లును ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. కొత్త బిల్లులో కీలక అంశాలను ప్రభుత్వం పొందుపరుస్తుంది. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లు రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

అమరావతిపై ఏపీ కేబినెట్ లో చర్చించామన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో వివరిస్తామని మంత్రి నాని చెప్పారు. కొందరు కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారని కొడాలి నాని విమర్శించారు. సీఎం జగన్ ఒక నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉంటారు.

Read Also : AP Three Capitals : ఏపీలో 3 రాజధానుల బిల్లు రద్దు