Hindu Country Nepal: నేపాల్ ను హిందూ దేశంగా ప్రకటించాలన్న డిమాండ్ కు సీనియర్ మంత్రి మద్దతు

నేపాల్ దేశాన్ని నూటికి నూరు శాతం హిందూ దేశంగా ప్రకటించాలంటూ గత కొంతకాలంగా ఆ దేశంలో వస్తున్న డిమాండ్ కు సీనియర్ మంత్రి ఒకరు గట్టి మద్దతు పలికారు.

Hindu Country Nepal: నేపాల్ దేశాన్ని నూటికి నూరు శాతం హిందూ దేశంగా ప్రకటించాలంటూ గత కొంతకాలంగా ఆ దేశంలో వస్తున్న డిమాండ్ కు సీనియర్ మంత్రి ఒకరు గట్టి మద్దతు పలికారు. ప్రపంచ హిందూ సమాఖ్య కార్యవర్గ సమావేశాన్ని నేపాల్ రాజధాని ఖాట్మండులో నిర్వహించారు. ఈ సమావేశంలో గురువారం ఆదేశ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ప్రేమ్ అలె పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రేమ్ అలె మాట్లాడుతూ..నేపాల్ ను హిందూ దేశంగా ప్రకటించాలనే ప్రజల అభిప్రాయం గట్టిదైతే..అందులో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తానని అన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ హిందూ సమాఖ్య కార్యవర్గ సమావేశానికి నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ మరియు బ్రిటన్ సహా 12 దేశాల నుండి 150 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.

Also Read:Delhi Kejriwal : దేశం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా

ప్రస్తుత ఐదు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంటులో మూడింట రెండు మెజారిటీని కలిగి ఉన్నందున, నేపాల్‌ను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్‌ను ప్రజాభిప్రాయ సేకరణకే పరిమితం అయిందని ప్రేమ్ అలె అన్నారు. ”మన రాజ్యాంగం దేశాన్ని(నేపాల్) లౌకిక రాజ్యంగా ప్రకటించినప్పటికీ, మెజారిటీ జనాభా హిందూ రాజ్యానికి అనుకూలంగా ఉంటే, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నేపాల్‌ను హిందూ రాష్ట్రంగా ఎందుకు ప్రకటించకూడదని” ఆయన ప్రశ్నించారు. గతంలో హిందూ రాజ్యమైన నేపాల్ ను 2008లో అకస్మాత్తుగా లౌకిక దేశంగా ప్రకటించడంపై ఆశ్చర్యపోయానని ప్రేమ్ అలె అన్నారు.

Also read:TTD – AP High court: టీటీడీ పాలక మండలిలో సభ్యుల నేర చరితపై మండిపడ్డ హైకోర్టు సిజే

కొన్ని దేశాలను ఇస్లామిక్‌ దేశాలుగానూ, మరికొన్ని దేశాలు క్రిస్టియన్‌ దేశాలుగాను ప్రకటించబడి..ప్రజాస్వామ్య విధానాన్ని అవలంబించగలిగితే, నేపాల్‌ను హిందూ ప్రజాస్వామ్య దేశంగా ఎందుకు ప్రకటించడం లేదని మంత్రి ప్రేమ్ అలె ఆదేశ పార్లెమెంటు సభ్యులను ప్రశ్నించారు. నేపాల్ లో రాచరికాన్ని రద్దు చేయాలంటూ 2006లో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. దీంతో 2008లో నేపాల్ దేశాన్ని లౌకిక రాజ్యాంగ ప్రకటించారు. అయితే సుమారు 90 శాతానికి పైగా ప్రజలు హిందు మతాన్ని ఆచరిస్తున్న నేపాల్ దేశాన్ని..పార్లెమెంటు తీర్మానం లేనప్పటికీ గతంలో పూర్తి హిందూ దేశంగానే పరిగణించేవారు.

Also read:AFPSA Reduced : ఈశాన్య రాష్ట్రాల్లో ప్ర‌త్యేక చ‌ట్టం ప‌రిధి కుదింపు చేస్తూ కేంద్రం కీల‌క నిర్ణయం

ట్రెండింగ్ వార్తలు