TTD – AP High court: టీటీడీ పాలక మండలిలో సభ్యుల నేర చరితపై మండిపడ్డ హైకోర్టు సిజే

తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో నేర చరితుల్ని సభ్యులుగా చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

TTD – AP High court: టీటీడీ పాలక మండలిలో సభ్యుల నేర చరితపై మండిపడ్డ హైకోర్టు సిజే

Ttd

TTD – AP High court: తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో నేర చరితుల్ని సభ్యులుగా చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘోరమైన నేరాలకు పాల్పడిన కొందరు వ్యక్తులు ఇటీవల టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా చేరారని అటువంటి వారిని వెంటనే తొలగించాలంటూ ఇటీవల హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు చీఫ్ జస్టిస్..నేరచరిత ఉన్నవారిని ఆలయ పాలకమండలిలో సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. “భగవంతుని సేవలో నేరచరితులా..? ఇలాంటి వాటిని ఉపేక్షించను” అంటూ హైకోర్టు సీజే ప్రభుత్వంపై, టీటీడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read:AP BC Ministers: సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ నేతలు సమావేశం: పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన

నేరచరితపై ప్రాదమిక ఆదారాలున్న వారు పాలకమండలి నియమకాలకు అర్హులు కారని ధర్మాసనం స్పష్టం చేసింది. సభ్యుల నియమకాలలో ఇతర ప్రయోజనాలున్నాయని అనుమానం వ్యక్తం చేసిన సిజే..తుది తీర్పులో దీనిపై కఠినంగా వ్యవహారిస్తామని హెచ్చరించారు. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియమాకాలపైనా హైకోర్టు మండిపడింది. పాలకమండలిలోని 30 మంది సభ్యుల్లో 18 మందికి నేర చరిత ఉందంటూ న్యాయవాది అశ్విన్ కుమార్ ప్రత్యేక పిటిషన్ ఫైల్ చేశారు. 18 మంది సభ్యుల నేర చరిత్రపై అశ్విన్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 19కి విచారణ వాయిదా వేసింది కోర్టు.

Also read:AP BC Ministers: సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ నేతలు సమావేశం: పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన