AP BC Ministers: సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ నేతలు సమావేశం: పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ నేతలు, మంత్రులు సమావేశం అయ్యారు.

AP BC Ministers: సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ నేతలు సమావేశం: పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన

Chellu

AP BC Ministers: 2024 ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారప్రతిపక్షాలు ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ లను సిద్ధం చేసుకుంటున్నాయి. అన్ని వర్గాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ..రానున్న ఎన్నికలకు సమాయత్తం అయ్యే విషయాలపై చర్చిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ నేతలు, మంత్రులు సమావేశం అయ్యారు. గురువారం తాడేపల్లిలో సజ్జల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ చైతన్య పర్యటనలు, సమావేశాలు నిర్వహించాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు నేతలు రూట్ మ్యాప్ ఖరారు చేసినట్లు నేతలు వివరించారు. సమావేశం అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ బీసీల కోసం సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు, జరిగిన మేలును నేతలంతా కలసి చర్చించామని తెలిపారు.

Also read:Chandrababu: గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారు: చంద్రబాబు

బీసీల ఆత్మగౌరవం కోసం తీసుకున్న చర్యలను వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులు చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. 139 బీసీ కులాలు ఉంటే 56 కార్పోరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని..రూ.31వేల కోట్లను బీసీ సబ్ ప్లాన్ కోసం ప్రభుత్వం కేటాయించిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వివరించారు. జంగా కృష్ణమూర్తితో కలిసి ఏప్రిల్ నెల 15 తర్వాత నెల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీ నేతలు, ప్రజలను సమాయత్తం చేయనున్నట్లు వేణుగోపాలకృష్ణ తెలిపారు. బీసీల సమస్యలను గుర్తించి నెరవేర్చేలా క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు.

Also Read:AP Current Charges : ప్రజల కోరిక మేరకే విద్యుత్ చార్జీలు పెంచాం – ఎనర్జీ సెక్రటరీ శ్రీధర్

తమ ప్రభుత్వం బీసీలకు చేసిన మంచిని ప్రజలకు తెలియజేయడంతో పాటు, లోపాలను సవరించడమే సదస్సుల నిర్వహణ ముఖ్య లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు పై ప్రతిపక్ష నేతల నుంచి వస్తున్న విమర్శలపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. టీడీపీ గత పాలనలో విద్యుత్ చార్జీలు పెంచలేదా? ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన విద్యుత్ పథకాలను చంద్రబాబు తీసివేయలేదా? అని మంత్రి ప్రశ్నించారు. గతంలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేసింది తెలుగుదేశం పార్టీనేనని, ప్రజలను ఏదో విధంగా దృష్టి మరల్చడమే టీడీపీ లక్ష్యమని వేణుగోపాలకృష్ణ విమర్శించారు.

Also read:AP Current : బాబు హయాంలో విద్యుత్ చార్జీలు పెరగలేదు… ఆయనే విజనరీ కారణం