Chandrababu: గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారు: చంద్రబాబు

జగన్ మూడేళ్లలోనే రూ.42,172 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని, గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు అన్నారు

Chandrababu: గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారు: చంద్రబాబు

Chandrababu

Chandrababu: విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని ప్రమాణ స్వీకార సభలో ప్రకటించిన జగన్ రెడ్డి మూడేళ్లలోనే రూ.42,172 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని, గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం అమరావతి నుంచి పార్టీ ముఖ్యనేతలతో ఆన్‌లైన్‌లో సమావేశమైన చంద్రబాబు..రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై భారం వేస్తున్న అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యుత్ రేట్లు చూసి పరిశ్రమలు ముందుకు వచ్చే పరిస్థితి లేదని అన్నారు.

Also read:Drugs Caught in City: డ్రగ్స్ తీసుకుని యువకుడు మృతి: హైదరాబాద్ లోనే మొదటి కేసు నమోదు

పెట్రోల్, డీజిల్, ఆస్తి పన్ను, చెత్త పన్ను, ఇసుక, సిమెంట్, మద్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఆర్థికంగా క్రుంగిపోయారని..విద్యుత్ చార్జీలు పెంచుతూ, ప్రజలపై పన్నులు వేస్తూ జగన్ మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. 400 యూనిట్లు పైబడి విద్యుత్ వినియోగం చేసే సంపన్న వర్గాలపై 6 శాతం పెంచి 125 యూనిట్ల లోపు వాడే పేద, దిగువ మధ్యతరగతి ప్రజలపై 57 శాతం ఛార్జీలు పెంచిన జగన్ ప్రభుత్వం సంపన్న వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తోందంటూ చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో కరెంట్ కోతలు ఎత్తివేసి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని తమ 5 ఏళ్ల పాలనలో 3.26 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా సరాసరి ఏడాదికి 65,200 కనెక్షన్లు ఇచ్చామని ఆయన గుర్తుచేశారు.

Also read:Hyderabad Metro: హాలీడే అంటే ట్రావెల్! ట్రావెల్ అంటే మెట్రో.. సూపర్ సేవర్ ఆఫర్ ఇదే

జగన్ మూడేళ్లలో ఇచ్చిన వ్యవసాయ కనెక్షన్లు కేవలం 1.17 లక్షలు మాత్రమేనని చంద్రబాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక..సౌర, పవన విద్యుత్ రంగాన్ని దెబ్బతీసి..మిగులు విద్యుత్ తో ఉన్న రాష్ట్రాన్ని లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా మార్చారంటూ చంద్రబాబు విమర్శించారు. జగన్ పాలనలో ఏడుసార్లు విద్యుత్ చార్జీల పెంపు కారణంగా ఇళ్లల్లో కరెంటు స్విచ్ వేయాలంటే ప్రజలు భయపడే పరిస్థితులు తెచ్చారని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు దూరదృష్టితో తాము విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేస్తే..నేడు జగన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికార వైసీపీపై అసహనం వ్యక్తం చేశారు.

Also read:Telangana Cabinet: తెరపైకి తెలంగాణ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ