Nepals PM visit Bharath : భారత పర్యటనకు నేపాల్ కొత్త ప్రధాని..ఇరు దేశాల మధ్యా మళ్లీ స్నేహం బలపడేనా?

నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దుబా భారత్ పర్యటనకు రానున్నారు. జనవరి రెండో వారంలో భారత్ లో పర్యటనకు రావొచ్చని అధికార వర్గాలు తెలిపాయి.

Nepals PM Deuba to visit India : నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దుబా భారత్ పర్యటనకు రానున్నారు. జనవరి రెండో వారంలో ఆయన భారత్ లో పర్యటనకు రావొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మోదీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు నిర్వహించనున్నారు. ఈ చర్చలు తిరిగి నేపాల్-భారత్ మధ్య తిరిగి స్నేహబంధాన్ని బలోపేతం చేస్తుందా? అనే చర్చలు జరుగుతున్నాయి భారత్ లో.

నవంబర్ లో గ్లాస్గో లో జరిగిన కాప్ 26 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీని నేపాలప్ ప్రధాని షేర్ దుబా కలిశారు. అలా ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే మార్గాలపై చర్చించారు. కరోనా మహమ్మారి కల్లోలం సమయంలో ఇరు దేశాలు సహాయ సహకారాలను ఇచ్చిపుచ్చుకున్నారు. అదే విషయాన్ని ఇరు దేశాధి నేతలు గ్లాస్గో వేదికగా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా భారత్ నేపాల్ కు చాలా గొప్ప సహాయాన్ని అందించింది. కరోనాను నియంత్రించటానికి టీకాలు, పలు రకాల మెడిసిన్స్ తో పాటు వైద్య పరికరాలను నేపాల్ కు పంపించింది.

Read more : నేపాల్ మ్యాప్ లో భారత భూభాగం..నేపాల్ పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లు

నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి హయాంలో భారత్ తో సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ తో మ్యాప్ విషయం చేసిన వివాదం..మరోపక్క చైనాకు స్నేహంగా మసలుకోవడం వంటి విషయాలు ఇరు దేశాల మధ్యా దూరాన్ని పెంచాయి. భారత్ తో సరిహద్దు అంశాలపై నేపాల్ వివాదాస్పదంగా వ్యవహరించిన తీరు ఎంత వివాదమైందో తెలిసిందే. కానీ..భారత్ మాత్రం నేపాల్ తో శాంతియుతంగా వ్యవహరించింది. ఈ క్రమంలో ద్వైపాక్షిక సంబంధాల పురోగతి దిశగా షేర్ బహదూర్ దుబా తన పర్యటనలో దృష్టి సారిస్తారేమో వేచి చూడాలి. ఎందుకంటే నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి కంటే ముందు కూడా నేపాల్ కు ప్రధానిగా దుబా ఏడు నెలల పాటు కొనసాగారు. ఆ సమయంలో భారత్ లో పర్యటించి ప్రధాని మోదీతో చర్చలు జరిపారు.

కాగా..భారత్​-నేపాల్​ మధ్య దశాబ్దాలుగా బలమైన స్నేహ సంబంధాలు కొనసాగాయి. భారత్ తర్వాత అత్యధిక శాతం హిందువులు ఉన్నది నేపాల్​లోనే. ఇంతకాలం మిత్రదేశాలుగా ఇరు దేశాల మధ్య ఇప్పుడు దూరం పెరిగింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా తమ ప్రాంతాలని నేపాల్ ప్రకటించడం రెండు దేశాల మధ్య వివాదంగా మారింది. ఆ ప్రాంతాలు తమ భూభాగంలో అంతర్భాగమని..నేపాల్​ కొత్తగా రూపొందించిన మ్యాప్​ను తీవ్రంగా వ్యతిరేకిస్తు.. భారత్​ నేపాల్ కు స్పష్టంచేసింది.

Read more : Bombay HC : మంచంమీద పడుకున్న మహిళ పాదాలు తాకినా ఆమె గౌరవాన్ని, మర్యాదను కించపరిచినట్లే : హైకోర్టు వ్యాఖ్యలు

ఈక్రమంలో నేపాల్ ప్రధాని భారత్ పర్యటనలో తిరిగి ఇరు దేశాల మధ్యా స్నేహభావం..ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయో లేదో వేచి చూడాలి..భారత పర్యటనలో భాగంగా నేపాల్ ప్రధాని దుబా గుజరాత్ వైబ్రంట్ సదస్సులో పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా భారత్-నేపాల్ మధ్య మధ్య గతంలో ఉన్న సత్సంబంధాలను పునరుద్ధరించాలంటే చర్చలు తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు