Father's reaction to daughter's tattoo
Father’s reaction to Daughter’s tattoo : ఓ యువతి వేయించుకున్న టాటూ చూసి తండ్రి రియాక్టైన తీరు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆమె తను వేయించుకున్న టాటూ ఫోటోని తండ్రికి షేర్ చేసింది. అది చూడగానే తండ్రి ‘ ఐ విల్ కిల్ యూ’ అంటూ రిప్లై ఇచ్చాడు. బహుశా అతను ప్రేమతోనే అలా పెట్టి ఉంటాడని జనాలు అభిప్రాయపడుతున్నారు.
Father’s request : మా అమ్మాయి టెడ్డీ బేర్ కనిపిస్తే దయ చేసి ఇవ్వండి అంటూ ఓ తండ్రి రిక్వెస్ట్
కొంతమంది పేరెంట్స్ పిల్లలు చేసే కొన్ని పనులు ఇష్టపడరు. బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లడం.. కొన్ని రకాల హెయిర్ స్టైల్స్ చేయించుకోవడానికి అంగీకరించరు. తల్లిదండ్రులు ఒప్పించడానికి పిల్లలు తెగ ప్రయత్నం చేస్తారు. అలాగే శరణ్య అనే యువతి ధైర్యం చేసి “05-02-1978” అని టాటూ వేయించుకుని ఆ ఫోటోని తండ్రికి షేర్ చేసింది. దానికి ఆమె తండ్రి ‘ఐ విల్ కిల్ యూ’ అని రిప్లై ఇచ్చాడు. ఈ పోస్టుని శరణ్య ‘మా నాన్న నా టాటూని అంగీకరించారు’ అని ట్యాగ్ కూడా చేసి పోస్ట్ చేసింది. ఇక ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘మీ తండ్రి పచ్చబొట్టు వేయించుకున్నందుకు అంగీకరించారు అని అనుకుంటున్నాను’ అని ఒకరు.. ‘అది మీ ఫాదర్ పుట్టిన తేదీనా’ అని మరొకరు కామెంట్లు పెట్టారు. ఇంతకీ ఆ టాటూని తండ్రి అంగీకరించడానికి కారణం ఏంటనుకునేరు? అది ఆమె తల్లి పుట్టిన తేదీ, నెల, సంవత్సరమట. అందుకని ప్రేమతో ఆ తండ్రి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
My dad approves of the tattoo clearly pic.twitter.com/8uJrYWq5X1
— sharanya;) (@sharandirona) May 10, 2023